Operation Sindoor: పది రోజుల క్రితం భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాకిస్థాన్ ను ముప్పుతిప్పలు పెట్టిన విషయం తెలిసిందే. భారత్ దెబ్బకు దాయాది దేశం పాకిస్థాన్ కు టన్నుల కొద్ది భయం పట్టుకుంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ త్రివిధ దళాలు నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిన విషయం తెలిసిందే. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని మొత్తం తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత్ మిసైల్స్‌తో విరుచుకుపడి 100 మందికి పైగా టెర్రరిస్తులను హతం చేసింది. అయితే దీనికి సంబంధించి పలు వీడియోలను భారత్ ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అయిత తాజాగా ఇండియన్ ఆర్మీ మరో వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది.
Planned.. Trained.. Executed
ఆర్మీ విడుదల చేసిన ఈ వీడియోలు.. ఉగ్రవాద శిబిరాలపై పక్కా ప్లానింగ్‌తో ఎలా అటాక్ చేయాలి..? టెర్రరిస్టులపై టార్గెట్ మిస్ అవ్వకుండా.. కచ్చితత్వంలో ఎలా దాడులు చేసింది..? ఇండియన్ ఆర్మీ ఎలా ప్లాన్ చేసింది..? సైనికులకు ఏ విధంగా శిక్షణ ఇచ్చింది..? అనే దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. అటాక్ అమలు చేసిన ప్రాసెస్ ను ‘ప్లాన్డ్.. ట్రెయిన్డ్.. ఎగ్జిక్యూటెడ్’ (Planned.. Trained.. Executed) కోట్ తో.. ఆర్మీ వెస్ట్రన్ కమాండ్ అధికారులు వీడియో రిలీజ్ చేశారు. సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
#StrongAndCapable#OpSindoor
“They don’t just Command; they inspire from the Frontlines.”Lt Gen #ManojKumarKatiyar, PVSM, AVSM #ArmyCommander visited and interacted with troops along the frontline.#JusticeServed@adgpi@prodefencechan1 pic.twitter.com/9vf4fVO1Po
— Western Command – Indian Army (@westerncomd_IA) May 18, 2025
ఇది పాక్‌కు గుణపాఠం
‘శ్రీనగర్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్ర దాడిలో భారతదేశ ప్రజల్లో ఆక్రోశం ఉప్పొంగిపోయింది. ప్రతి భారతీయ పౌరుడు రగిలిపోయాడు. ఈ సారి దాయాది దేశానికి జీవితాంతం గుర్తిండిపోయేలా.. భారత్ దెబ్బకొట్టింది. పాకిస్థాన్ కు తరతరాలు గుర్తించుకునేలా గుణపాఠం నేర్పించాలనే ఒకేఒక ఆలోచన ఇండియన్ ఆర్మీకి తట్టింది. ఇది ప్రతీకార చర్య ఏమాత్రం కాదు. పహాల్గామ్ దాడి చనిపోయిన బాధిత కుటుంబాలకు భారత్ చేసిన న్యాయం. ఉగ్రవాదులను పోషిస్తున్న పాకిస్థాన్ దేశానికి తగిన గుణపాఠం’ అని ఆర్మీ అధికారులు వీడియోలు తెలిపారు.
Also Read: Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రాపై అప్పుడే నిఘా పెట్టి ఉంటే.. పహల్గాం దారుణం జరిగేది కాదా..?
ఏప్రిల్ 22న పహాల్గామ్ ఉగ్రదాడి జరిగింది. ఈ దాడి అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లో మే 7 అటాక్ చేసింది. ఆ తర్వాత మే 9న అర్ధరాత్రి, 10న పాక్ లోని కీలక వాయుసేన స్థావరాలపై పక్కా ప్లాన్ తో గురి తప్పకుండా దాడులు చేశామని అధికారులు పేర్కొన్నారు. పూర్తిగా స్వదేశీ ఆయుధాలతో దాడి చేసి.. 11 వాయుసేన స్థావరాలను దెబ్బతీసినట్టు తెలిపారు.
Also Read: Liquor prices: మందుబాబులకు షాకింగ్ న్యూస్.. మద్యం ధరలపై మళ్లీ పెరిగినయ్.. ఈసారి ఎంతంటే?