Samantha..ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha ) తాజాగా ‘శుభం’ సినిమాతో నిర్మాతగా మొదటి విజయాన్ని అందుకుంది. ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్ పై రూపొందించిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఇకపోతే శుభం సినిమా చేసిన సౌండ్ కంటే సమంత డేటింగ్ రూమర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు (Raj Nidimoru) తో సమంత కొంతకాలంగా రిలేషన్ లో ఉందంటూ వార్తలు జోరుగా వినిపించాయి. దీనికి తోడు సమంత గత కొన్ని రోజులుగా ఎక్కడికి వెళ్లినా రాజ్ వెంటే ఉండడం, మొన్నటికి మొన్న అతడి భుజంపై తలవాల్చి ఒక సెల్ఫీ దిగి మరీ సమంత పోస్ట్ చేయడంతో రూమర్స్ కి మరింత బలం చేకూరింది. ఇలా రోజురోజుకీ సమంత పై నెగిటివిటీ పెరుగుతున్న వేళ.. ఆమె అసిస్టెంట్ ఆర్యన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
డైరెక్టర్ తో సమంత ఎఫైర్..
అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల శుభం మూవీ సక్సెస్ మీట్ జరగగా.. ఆ స్టేజ్ పై సమంతని చూడగానే ఆర్యన్ ఎమోషనల్ అయిపోయాడు. ఆ సమయంలో సమంత అతడిని దగ్గరకు తీసుకొని మరీ ఓదార్చిన వీడియో వైరల్ అయింది. ఇక సమంత కెరియర్ మొదలుపెట్టిన నాటి నుండి దాదాపు 15 ఏళ్లుగా సమంత దగ్గరే ఆర్యన్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఆ స్థాయి నుంచీ తనను నిర్మాతగా మార్చిన సమంతాకి జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపిన ఆర్యన్.. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు పంచుకున్నారు. అందులో భాగంగానే డైరెక్టర్ తో సమంత డేటింగ్ చేస్తోంది అంటూ వస్తున్న వార్తలపై ఆర్యన్ మాట్లాడుతూ.. “సమంత డేటింగ్ లో ఉందంటూ ఎన్నో వార్తలు వస్తున్నాయి.. ఆమె ఎవరి పక్కనైనా నడిచినా తప్పే.. నిజానికి సమంత ఏం చేసినా తప్పే అన్నట్లుగా పోస్ట్లు పెడుతున్నారు. ఫ్లైట్ లో నిద్రపోతున్నా తప్పే.. రెస్టారెంట్లో భోజనం చేసినా తప్పే.. ఒకరు బాగుంటే వాళ్ల గురించి ఏదేదో రాసేస్తారు. ఇలాంటివి చూసినప్పుడు ఆవిడ నవ్వుకోవడం తప్ప ఇంకేం చేస్తుంది. ఎందుకంటే సమంత ఇలాంటివి ఎన్నో చూసి ఈ స్టేజ్ కి వచ్చింది” అంటూ సమంత డేటింగ్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు ఆర్యన్.
ALSO READ: Tollywood: షాకింగ్..రెండు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్.. కారణం ఏంటంటే..?
నా తల్లిదండ్రుల కంటే ఎక్కువ.. జీవితాంతం రుణపడి ఉంటాను – ఆర్యన్..
సమంత అసిస్టెంట్ ఆర్యన్ మాట్లాడుతూ..”దాదాపు 15 ఏళ్ల క్రితం నేను నా కుటుంబాన్ని వదిలి హైదరాబాద్ వచ్చాను. ‘ఏ మాయ చేసావే’ చిత్రంలో ఒక కొత్త హీరోయిన్ కి అసిస్టెంట్ గా చేసే అవకాశం వచ్చిందని చెబితే వెళ్లాను. అక్కడ సమంత దగ్గర అసిస్టెంట్గా చేరే అవకాశం లభించింది. అలా మొదలైన మా ప్రయాణం 15 ఏళ్ళుగా కొనసాగుతూనే ఉంది. ఈ మధ్యలో ఎంతో మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు నాకు అవకాశం ఇచ్చారు. కానీ నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే నాకు సమంత అంత అండగా నిలిచింది. నిజంగా ఎవరికైనా కష్టం ఉందని ఆవిడ దృష్టికి వెళితే.. కచ్చితంగా ఆమె సహాయం చేయకుండా వెనక్కి పంపలేదు. నాకు ఒక రకంగా చెప్పాలి అంటే.. నా తల్లిదండ్రుల కంటే సమంతనే ఎక్కువ. మా ఇద్దరిదీ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ లాంటిది. నాకు ఏ మాయ చేసావే సినిమాకి రూ.400 రోజుకి డబ్బులు ఇస్తే.. ఆ తర్వాత నాకు ఇష్టమైన బైక్ కొనుక్కోవడానికి సమంత డబ్బులు ఇచ్చింది. ఇప్పుడు నేను నిర్మాతగా మారే స్థాయికి ఆమె నన్ను తీసుకొచ్చింది. ఆమె ఎంతో గొప్ప మనిషి. క్రమశిక్షణ కలిగిన వ్యక్తి.. ఇలాంటి ఆవిడను నేను ఎక్కడా చూడలేదు” అంటూ ఆర్యన్ తెలిపారు. ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు, హెల్త్ ఇష్యూ, విడాకులు , డిప్రెషన్ ఇలా ఎన్నో ఉన్నా కూడా ఏనాడు పని విషయంలో లైట్ తీసుకోలేదు. ఇచ్చిన డేట్ కి పని చేసి వచ్చేది.. అంటూ సమంత పై ప్రశంసలు కురిపించారు ఆర్యన్.