BigTV English

Trump Attack: ట్రంప్ పార్టీ కార్యక్రమంలో కత్తులతో దాడి చేయబోయిన వ్యక్తి .. కాల్చి చంపిన పోలీసులు!

Trump Attack: ట్రంప్ పార్టీ కార్యక్రమంలో కత్తులతో దాడి చేయబోయిన వ్యక్తి .. కాల్చి చంపిన పోలీసులు!

Trump Attack: ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన తరువాత.. సోమవారం రాత్రి మిల్ వాకీ నగరంలో జరిగిన ట్రంప్ కు చెందిన రిపబ్లికన్ పార్టీ సమావేశాల్లో ఒక గుర్తు తెలియన వ్యక్తి తన రెండు చేతులలో కత్తులు పట్టుకొని జనంపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుండగా.. పోలీసులు అతడిని కాల్చి చంపారని మంగళవారం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మిల్ వాకీ నగర మేయ్ జెఫ్రీ నార్మెన్ తెలిపారు.


”సోమవారం రిపబ్లికన్ పార్టీ జాతీయ సమావేశ కార్యక్రమంలో ఓ వ్యక్తి రెండు చేతులలో కత్తులు పట్టుకుని సామార్య జనంపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఒహాయో పోలీస్ డిపార్ట్ మెంట్‌కు చెందిన అయిదుగురు పోలీసులు అతడిని కత్తులు కిందపడేసి సరెండర్ చేయమని హెచ్చరించారు. కానీ ఆ వ్యక్తి దాడి చేయడానికి ముందుకు సాగిపోయాడు.. అతడిని అడ్డుకునేందుకు పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆ దాడి చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి చనిపోయాడు. సామాన్య జనానికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.” అని మిల్ వాకీ మేయర్ అన్నారు.

ఈ కార్యక్రమానికి ముందు ముసుగు వేసుకున్న ఓ వ్యక్తి ఏకె-47 తుపాకీ పట్టుకొని తిరుగుతుండడం చూసి.. అతడిని అనుమానంపై పోలీసులు అరెస్టు చేశారు. అయితే అతని గుర్తింపుని బహిర్గతం చేయలదు


మిల్ వాకీ నగర శివార్లలో జరిగిన రిపబ్లికన్ పార్టీ జాతీయ సమావేశ కార్యక్రమంలో కత్తులు చేతపట్టుకొని దుండగుడు రావడం, ఆ వ్యక్తి మరో నగర పోలీసుల కాల్చిచంపడంతో మిల్ వాకీ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. దీనిపై మేయర్ స్పందించారు. నగర ప్రజలకు ఎటువంటి ప్రమాదం లేదని.. కేవలం రాజకీయ కార్యక్రమానికి సంబంధించే ఈ దాడి జరిగిందని సామాన్య ప్రజలకు ఎటువంటి హాని జరగలేదని సమాధానమిచ్చారు.

Also Read: ఫ్రాన్స్ ప్రధాని గేబ్రియల్ అటల్ రాజీనామా ఆమోదించిన అధ్యక్షుడు మాక్రాన్.. ఆపధర్మ ప్రధానిగా  కొనసాగింపు..

పెన్సెల్వేనియా నగరంలో అధ్యక్ష ఎన్నికల అధ్యర్థి డొనాల్ ట్రంప్‌పై గత వారం జరిగిన హత్యాయత్నం ఘటనతో అమెరికాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తరువాతే ఎన్నికల నేపథ్యంలో మిల్ వాకీ నగరంలో ఆయన పార్టీ జాతీయ సమావేశం కార్యక్రమం ఉండడంతో భద్రత కోసం స్థానిక పోలీసులకు అదనంగా ఇతర నగర పోలీసులు కూడా వచ్చారు.

మిల్ వాకీ నగర మేయర్ తెలిపిన వివరాల ప్రకారం.. కొలంబస్ ఒహాయో పోలీసులు సైకిల్ పెట్రోలింగ్ చేస్తుండగా.. ఓ వ్యక్తి కత్తులు చేతపట్టుకొని మరో వ్యక్తిపై దాడి చేయబోగా కాల్పులు జరిపారు. అయితే ఈ ఘటనపై స్థానిక ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. “మరో నగర పోలీసులు మన ప్రాంతంలో రావడమేంటి?.. అసలు రాజకీయ కార్యక్రమం రాత్రి సమయంలో నిర్వహించడమేంటి. చనిపోయిన వ్యక్తి మిల్ వాకీలో నివసించేవాడు. అతను కార్యక్రమానికి సమీపంలో పబ్లిక్ పార్కులో మరొకరితో గొడవపడుతుండగా.. వేరే రాష్ట్ర పోలీసులు అతడిని చంపేయడమేంటని?” అని ప్రశ్నించారు.

కెన్నెత్ జాన్సన్ అనే సామాజిక కార్యకర్త.. మిల్ వాకీ నగరంలో పేదవారి.. ఇల్లులేని వారికి సహాయం చేస్తుంటాడు. ఈ ఘటనపై జాన్సన్ స్పందిస్తూ.. ”చనిపోయిన వ్యక్తి పేరు శామ్యూల్ షార్ప్.. అతడికి ఉండడానికి ఇల్లు లేదు.. ఉద్యోగం కోల్పోయి పార్కులలో నిద్రపోతున్నాడు.. చాలాసార్లు అతడికి నేను భోజనం అందించాను. అతను కత్తులు చేతబట్టుకొని ఉంటే అరెస్టు చేయాల్సింది. అంతే కానీ చంపేయడమేంటి?” అని ప్రశ్నించాడు.

మరోవైపు మినెసోట్టా కు చెందిన అమెరికా ప్రభుత్వ ప్రతినిధి.. రిపబ్లికన్ పార్టీ జాతీయ సమావేశంలో పాల్గొనడానికి పోతుండగా.. ద్వార సమీపంలో ఆయనపై ఒక నిరసనకారుడు దాడి చేసినట్లు తెలిపారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×