BigTV English

Dhammika Niroshana shot dead: భార్య పిల్లల ముందే క్రికెటర్ దారుణ హత్య

Dhammika Niroshana shot dead: భార్య పిల్లల ముందే క్రికెటర్ దారుణ హత్య

Dhammika Niroshana shot dead: శ్రీలంక మాజీ క్రికెటర్ ధామిక నిరోషనను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. భార్యా పిల్లల ఎదుటే గన్‌తో కాల్చిచంపారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.


గాలె జిల్లాలోని అంబాలన్‌గోడా ప్రాంతంలో ధామిక ఉంటున్నాడు. అయితే మంగళవారం రాత్రి గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు భార్య, పిల్లల ముందే ఆయన్ని కాల్చి చంపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.

ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే కాల్పులకు పాల్పడింది ఎవరన్నది ఇంకా తెలియరాలేదు.


ఫాస్ట్ బౌలర్ అయిన ధామిక 2000 ఏడాది శ్రీలంక అండర్ 19 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత రెండేళ్లపాటు వన్డేలు, టెస్టులకు ఆడాడు. మాజీ క్రికెటర్ మృతికి పలువురు లంక క్రికెటర్లు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు.

ALSO READ:  ప్రాక్టీసులో మహమ్మద్ షమి, బంగ్లాదేశ్ సిరీస్ కోసం..

ధమిక హత్య ఘటనతో స్థానిక క్రికెట్ కమ్యూనిటీలు షాక్ అయ్యాయి. నిరోషనా జీవితం హఠాత్తుగా హింసాత్మకంగా ముగియడం చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. దర్యాప్తు కొనసాగుతున్నందున, ఈ కేసును ఛేదించడానికి సహాయం చేయడానికి ఎవరైనా ముందుకు రావాలని అధికారులు రిక్వెస్ట్ చేశారు.

Tags

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×