Bishop Mar Mari Emmanuel: ప్రస్తుతం ప్రపంచంలోని పలు దేశాల్లో యుద్ధాలు మారణ హోమాలను సృష్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ నడుమ ఎంతో కాలంగా యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఈ యుద్ధంలోకి నార్త్ కొరియా ఎంట్రీ ఇచ్చింది. రష్యా బలగాలతో కలిసి ఉక్రెయిన్ మీది దాడికి దిగుతున్నాయి. నార్త్ కొరియా అధినేత వ్యవహార శైలి ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో ఎవరూ చెప్పలేరు. మరోవైపు ఇజ్రాయెల్, ఇరాన్, సిరియా, హమాస్, హిజ్ బొల్లా నడుమ భీకర దాడులు కొనసాగుతున్నాయి. నిత్యం దాడులు, ప్రతిదాడులతో ఆయా దేశాలు దద్దరిల్లుతున్నాయి. అటు చైనా, తైవాన్ నడుమ కూడా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణంలోనైనా యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంది.
సంచలనం కలిగిస్తున్న బిషప్ వ్యాఖ్యలు
పలుదేశాల నడుమ తీవ్ర ఉద్రికత్తతలు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. ఏ క్షణంలోనైనా మూడో ప్రపంచ యుద్ధం మొదలయ్యే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియన్ బిషప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడో ప్రపంచ యుద్ధం కచ్చితంగా వచ్చి తీరుతుందంటూ సిడ్నీకి చెందిన బిషప్ మార్ మేరీ ఇమ్మాన్యుయేల్ కుండబద్దలుకొట్టారు. అంతేకాదు, మూడో ప్రపంచ యుద్ధం మానవాళికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందన్నారు. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు బతికి ఉన్నవాళ్లు ఎందుకు పుట్టామా? అని బాధపడతారన్నారు. “మూడో ప్రపంచ యుద్ధ కచ్చితంగా వస్తుంది. ఈ యుద్ధం మానవాళికి తీరని నష్టాన్ని కలిగిస్తుంది. ఈ యుద్ధంలో ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు మంది చనిపోయారు. మిగిలిన మూడింట రెండొంతు మంది ఎందుకు పుట్టామా? అని ప్రశ్చాత్తాప పడుతారు. అణు ఆయుధాలు కేవలం ప్రదర్శకన కోసమే కాదు.. ఈ యద్ధంలో వాడుతారు. చైనా, అమెరికా, సౌత్ కొరియా, జపాన్ లాంటి దేశాలు అణు అస్త్రాలను వినియోగిస్తారు. మానవ చరిత్రలోనే అత్యంత భయంకరమైన సమయం అని రాబోతుంది” అంటూ బిషప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
A prophecy of world War 3.
Almost one third of the population will perish.
It will be the most disastorous , times of humanity. pic.twitter.com/om9PIia9BH
— M. O. G. Bishop mar mari Emmanuel (@Bishopmurmuri) November 24, 2024
అమెరికా ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ(FEMA) అణు దాడిని నివారించే చర్యలపై గైడ్ లైన్స్ జారీ చేసిన సమయంలో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అణుదాడులు జరిగే అవకాశం ఉందనే ఆందోళన నెలకొన్ననేపథ్యంలో బిషప్ వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి.
బాబా వెంగా, నోస్ట్రాడమస్ అంచనాలు
ప్రముఖ ఫ్రెంచ్ జ్యోతిష్యుడు నోస్ట్రాడమస్, బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వెంగా సైతం 2025 సంవత్సరం గురించి కీలక విషయాలు వెల్లడించారు. ప్రపంచ అంతానికి బీజం పడే అవకాశం ఉందని ఖరాఖండిగా చెప్పారు. దేశాల నడుమ యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, గ్రహాంతరవాసుల దాడులు జరుగుతాయని అంచనావేశారు. 2025లో యూరప్ లో పెద్ద యుద్ధం జరుగుతుందని హెచ్చరించారు. ఈ యుద్ధం కారణంగా ప్రపంచం నాశనం అయ్యేందుకు బీజం పడుతుందని వార్నింగ్ ఇచ్చారు. ప్రపంచ జనాభాకు తీవ్ర నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు. ఇప్పుడు ఆస్ట్రేలియన్ బిషప్ కూడా ఇంచుమించు ఇదే విషయాన్ని చెప్పడం ఆందోళన కలిస్తున్నది.
Read Also: మూడో ప్రపంచ యుద్ధం.. బాబా వంగా, నోస్ట్రాడమస్ చెప్పింది ఇదే, మీరు సిద్ధమేనా?