Hyderabad Crime: చెల్లెలిపై ఉన్న ప్రేమ చివరకు హత్యకు దారి తీసింది. చెల్లెలిని వేధిస్తున్న ఓ యువకుడిని గుర్తించిన అన్న, ఏకంగా తన గ్యాంగ్ తో దాడికి పాల్పడి చివరకు హత్యకు కారకుడయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని కూకట్ పల్లి లో బుధవారం జరిగింది.
కూకట్ పల్లికి చెందిన పవన్ కు ఓ సోదరి ఉంది. ఆ యువతిని వెంకట రమణ అనే యువకుడు వేధించేవాడు. ఈ విషయం యువతి కాస్త ఇంట్లో చెప్పింది. ఇప్పటికే పలుమార్లు వెంకటరమణకు హెచ్చరించారట యువతి కుటుంబసభ్యులు. అయితే వెంకటరమణ మాత్రం అదే రీతిలో వేధించేవాడని యువతి కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. ఈ వేధింపులు ఇలాగే సాగుతుండేవట.
రోజువారీ మాదిరిగానే వెంకట రమణ కూకట్ పల్లి కి వచ్చి బుధవారం ఉన్నాడు. ఆ సమయంలో యువతి అన్న పవన్ తో పాటు మరికొందరు అక్కడికి చేరుకున్నారు. వెంకట రమణ కూడా సైలెంట్ గా అలాగే ఉండగా, పవన్, అతని వెంట వచ్చిన వారు ఒక్కసారిగా చపాతీ కర్రతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో వెంకట రమణ తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు కొద్దిసేపు భయాందోళనకు గురయ్యారు. చివరకు దాడి జరుగుతుందని గ్రహించి అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఎలాగోలా తీవ్ర రక్తస్రావంతో ఉన్న వెంకటరమణ ను వైద్యశాలకు తరలించారు. అప్పటికే ఆరోగ్యం విషమించడంతో రమణ కన్నుమూశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి వివరాలు ఆరా తీశారు. అలాగే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చెల్లిని వేధించాడన్న నెపంతో దాడి జరిగిందా, మరే ఇతర కారణం ఉందా అన్నది పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. కొందరు మాత్రం చెల్లెలిని వేధించినందుకే ఈ దాడి జరిగిందని, దాడికి పాల్పడింది పవన్, అజయ్, శ్రీధర్, సురేష్ అనే యువకులుగా నిర్ధారించారు.
యువతిని వేధించినందుకు హత్యకు గురైన యువకుడు
తన సోదరిని వేధించాడని వెంకటరమణ అనే యువకుడిని హత్య చేసిన పవన్ అండ్ గ్యాంగ్
చపాతీ కర్రతో వెంకటరమణ తలపై కొట్టిన పవన్, అజయ్, శ్రీధర్, సురేష్ అనే యువకులు
చికిత్స పొందుతూ మృతి చెందిన వెంకటరమణ
హైదరాబాద్ నగరం కూకట్పల్లి పరిధిలో జరిగిన ఘటన… pic.twitter.com/ZWnzaRDMvn
— BIG TV Breaking News (@bigtvtelugu) November 27, 2024