BigTV English

Mark Zuckerberg : హాస్పిటల్‌లో మార్క్ జుకర్ బర్గ్.. MMA ఫైట్ కోసమే అంటూ పోస్ట్!

Mark Zuckerberg : సోషల్ నెట్‌వర్కింట్ దిగ్గజం మెటా(ఫేస్‌బుక్) సంస్థాపకుడు మార్క్ జకర్‌బర్గ్ ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నారు. ఆయన మోకాలికి గాయం కావడంతో వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ఆసుపత్రి బెడ్ పై ఎడమ కాలికి బ్యాండేజ్, సపోర్టివ్ లెగ్ బ్రేస్ తో కనిపిస్తున్న ఫోటోలను జకర్‌బర్గ్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు

Mark Zuckerberg : హాస్పిటల్‌లో మార్క్ జుకర్ బర్గ్.. MMA ఫైట్ కోసమే అంటూ పోస్ట్!

Mark Zuckerberg : సోషల్ నెట్‌వర్కింట్ దిగ్గజం మెటా(ఫేస్‌బుక్) సంస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నారు. ఆయన మోకాలికి గాయం కావడంతో వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ఆసుపత్రి బెడ్ పై ఎడమ కాలికి బ్యాండేజ్, సపోర్టివ్ లెగ్ బ్రేస్ తో కనిపిస్తున్న ఫోటోలను జుకర్‌బర్గ్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఎంఎంఏ ఫైట్ కోసం శిక్షణ తీసుకుంటున్న సమయంలో తనకు గాయం అయినట్లు ఆయన తన పోస్ట్‌లో రాశారు.


‘మోకాలికి తగిలిన గాయానికి శస్త్ర చికిత్స చేయడం ద్వారా బయటపడ్డాను..నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్న వైద్య బృందానికి కృతజ్ఞతలు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న MMA(మిక్స్‌డ్ మార్షియల్ ఆర్ట్స్) ఫైట్ కోసం శిక్షణ పొందుతున్నాను.. కానీ ఇప్పుడు అది కాస్త ఆలస్యమైంది..గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాక తిరిగి శిక్షణ ప్రారంభిస్తాను. ఈ సమయంలో నాకోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అంటూ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు.

మార్క్ జుకర్‌బర్గ్ నిజానికి మార్షియల్ ఆర్ట్స్‌లో చాలా కాలం నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఆయన ఇటీవలే బ్రెజిల్ మార్షియల్ ఆర్ట్స్ జు జిత్సులో బ్లూ బెల్ట్ సాధించాడు.


అయితే ఈ పోస్ట్‌లో ఆయన MMA ఫైట్ ప్రస్తావన చేయగానే చాలా మంది నెటిజెన్లు ఇది నిజమేనా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. జుకర్‌బర్గ్ లాంటి దిగ్గజం MMA ఫైట్ చేయబోతున్నాడా అని ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×