BigTV English

Pakistan Worst record : చెత్త రికార్డులను మూటగట్టుకున్న పాకిస్తాన్

Pakistan Worst record :  చెత్త రికార్డులను మూటగట్టుకున్న పాకిస్తాన్
New Zealand vs Pakistan

Pakistan Worst record : 48 ఏళ్ల వరల్డ్ కప్ చరిత్రలోనే పాకిస్తాన్ చెత్త రికార్డులను నమోదు చేసుకుంది. చెన్నైలోని చిన్నస్వామి స్టేడియంలో 2023 వన్డే వరల్డ్ కప్ లో భాగంగా  పాకిస్తాన్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో అనేక కొత్త రికార్డులు వెలిశాయి.


ముఖ్యంగా పాక్ బౌలర్ హరీస్ రౌఫ్ ప్రపంచకప్ లో అత్యధిక సిక్సర్లు ఇచ్చిన బౌలర్ గా చెత్త రికార్డ్ మూట గట్టుకున్నాడు. ఇప్పటివరకు ఆడిన మ్యాచుల్లో 16 సిక్సర్లు సమర్పించుకున్నాడు. ఇక ఇదే మ్యాచ్ లో తను అత్యధికంగా 85 పరుగులు కూడా ఇచ్చాడు. ఒకే ప్రపంచకప్ లో 80కి పైగా పరుగులిచ్చిన తొలి పాకిస్తాన్ బౌలర్ గా మరో చెత్త రికార్డ్ నమోదు చేశాడు.

ఇంకా వన్డే ప్రపంచకప్ లో 400కు పైగా పరుగులు సమర్పించుకోవడం పాకిస్తాన్ కు ఇదే తొలిసారి. మరో యువ బౌలర్, భవిష్యత్ ఆశాకిరణంగా చెప్పుకునే షాహీన్ అఫ్రిది కూడా లయ తప్పాడు. ఇంతవరకు పాకిస్తాన్ బౌలర్లలో తనే అత్యధికంగా వికెట్లు తీసుకుంటూ వచ్చాడు. ఇప్పటికి 16 వికెట్లు తీసుకున్నాడు.


నిజానికి బుమ్రా (15), షమీ (14) కూడా తన తర్వాతే ఉన్నారు. అలాంటి ఆఫ్రిది కివీస్ తో మ్యాచ్ లో ఒక్క వికెట్టు కూడా తీయలేదు సరికదా…90 పరుగులు ఇచ్చాడు. దీంతో ప్రపంచకప్ చరిత్రలో ఒక మ్యాచ్ లో అత్యధిక పరుగులిచ్చిన పాక్ బౌలర్ గా తను కూడా ఒక చెత్త రికార్డ్ మూటగట్టుకున్నాడు.

న్యూజిలాండ్ కూడా వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక స్కోరుని నమోదు చేసింది. అలాగే పాకిస్తాన్ మీద ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు చేయడం ఇదే మొదటిసారి. ఇంకా చెప్పాలంటే 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక ఫోర్లు కొట్టిన జట్టుగా కివీస్ కొత్త రికార్డ్ స్రష్టించింది. వీరు మొత్తం 46 ఫోర్లు కొట్టడం విశేషం. ఇదండీ సంగతి…

అయితే పాకిస్తాన్ కూడా ధీటుగానే బదులిస్తోంది. 21.3 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 160 పరుగులు చేసింది. కాకపోతే మరి అదృష్టమో, దురదృష్టమో తెలీదు. వర్షం వచ్చి మ్యాచ్ కి అంతరాయం కలిగింది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×