BigTV English

Rubik World Record: స్పీడ్ క్యూబర్ మాక్స్ మరో ప్రపంచ రికార్డు..

Rubik World Record: స్పీడ్ క్యూబర్ మాక్స్ మరో ప్రపంచ రికార్డు..

Rubik World Record: రూబిక్ క్యూబ్‌ను పరిష్కరించడంలో మాక్స్ పార్క్ దిట్ట. తాజాగా ఆయన మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. 7x7x7 రొటేటింగ్ పజిల్ క్యూబ్‌ను ఫాస్టెస్ట్ యావరేజ్ టైంలోనే సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.


క్యూబ్‌ను సాల్వ్ చేసేందుకు మాక్స్‌కు పట్టిన సగటు సమయం 1 నిమిషం 41.78 సెకన్లు. గత నెల 27న కాలిఫోర్నియాలో జరిగిన యూనివర్సిటీ హైట్స్ క్యూబింగ్ వింటర్ 2024 పోటీల్లో ఈ అద్భుత రికార్డును మాక్స్ సాధించాడు.

7x7x7 క్యూబ్‌ను 232 డియోక్విన్ కాంగ్టిలియన్ కాంబినేషన్లలో పరిష్కరించొచ్చు. డియోక్విన్ కాంగ్టిలియన్ అంటే 1 పక్కన 159 సున్నాలు చేరిస్తే వచ్చే సంఖ్య. ఇంకోలా చెప్పాలంటే అనంత విశ్వంలోని మొత్తం అణువుల సంఖ్య కన్నా ఎక్కువే.


Read More: పుతిన్ వెనక్కి తగ్గితే హత్య చేస్తారు.. ఎల్లన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు..

స్టాండర్డ్ 3x3x3 క్యూబ్‌ను 3.13 సెకన్లలో పరిష్కరించి నిరుడు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అలాగే 7x7x7 క్యూబ్‌ను 1 నిమిషం 35.68 సెకన్లలో ఛేదించిన సింగిల్ సాల్వ్ రికార్డు కూడా అతని పేరిటే నమోదైంది.
చిన్నతనంలో ఆటిజం లక్షణాలతో బాధపడిన మాక్స్.. పదో ఏట నుంచే రూబిక్ క్యూబ్ చేతపట్టాడు. పలు పోటీల్లో పాల్గొన్నాడు. ప్రస్తుతం 22 ఏళ్ల వయసున్న మాక్స్.. స్పీడ్ క్యూబింగ్ ప్రపంచ రికార్డులన్నింటినీ దాదాపు సొంతం చేసుకున్నాడు. తాజా రికార్డుతో కలిపి మాక్స్ మొత్తం ఏడు స్పీడ్ క్యూబింగ్ రికార్డులను సాధించాడు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×