BigTV English

Millionaires Migration: సంపన్నులందరూ ఒకే దేశానికి పయనం.. వలసవెళుతున్న ప్రపంచకుబేరులు

Millionaires Migration: సంపన్నులందరూ ఒకే దేశానికి పయనం.. వలసవెళుతున్న ప్రపంచకుబేరులు

Millionaires Migration| ప్రపంచంలోని సంపన్నులంతా తమ లక్షల కోట్ల సంపద తీసుకొని సురక్షిత, స్థిరమైన వాతావరణం కోసం ఇతర దేశాలకు వలస వెళుతున్నారు. ఈ ట్రెండ్ గత కొన్ని సంవత్సరాల్లోనే ఎక్కువవుతోంది. హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ ప్రకారం.. 2025లో.. 1,42,000 మంది మిలియనీర్లు కొత్త దేశాలకు వలస వెళ్లనున్నారు. ఈ సంఖ్య 2026 నాటికి మరింత పెరిగి 1,65,000కి చేరనుంది. ఈ వలసలు ప్రపంచవ్యాప్తంగా సంపద కదలికను పెంచుతున్నాయి.


వీరంతా సామాన్య ధనికులు కాదు. వీరు హై-నెట్-వర్త్ ఇండివిడ్యువల్స్. అంటే వీరిలో ప్రతి ఒక్కరి వద్ద కనీసం 10 లక్షల డాలర్లు (సుమారు రూ. 8.3 కోట్లు) లిక్విడ్ అసెట్స్ అంటే ద్రవ సంపద ఉంది. వీరు ఎక్కడికి వెళితే, అక్కడికి ఈ ధ్రవ సంపద ప్రభావం కూడా ఉంటుంది. అంటే ఆ దేశాల్లో బిజినెస్ పెడతారు. ఐశ్వర్యంగా జీవించేందుకు బాగా ఖర్చు పెడతారు. దీనివల్ల ఆ కొత్త దేశం మరింత అభివృద్ధి చెందుతుంది. అందుకే సంపన్నులను ఆకర్షించేందుకు ప్రపంచంలో చాలా దేశాలు పోటీపడుతున్నాయి. కానీ ఈ బిలియనీర్లు మాత్రం ఒకే దేశానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అదే గల్ఫ్ దేశాల్లోనే అత్యంత ఫేమస్ దేవం యుఎఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్). యుఎఈలో దుబాయ్, అబుదాబి, షార్జా లాంటి నగరాల్లో జీవించేందుకు ఇతర దేశాల్లో నివసించే ధనిక ప్రజలు క్యూకడుతున్నారు.

యుఎఈ (UAE).. సంపన్నులకు కొత్త ఆకర్షణ
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వరుసగా మూడో సంవత్సరం మిలియనీర్లకు అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానంగా నిలిచింది. 2025లో 9,800 మంది సంపన్నులు UAEకి వలస వెళ్లనున్నారు. ఇది 2024లో 6,700గా ఉండేది. అంటే ఒక సంవత్సరంలోనే దాదాపు 50 శాతం పెరుగుదల.


UAE ఆకర్షణకు కారణాలు:
ప్రధాన కారణం ఈ దేశంలో ఆదాయ పన్ను లేకపోవడం, అత్యాధునిక సౌకర్యాలు, రాజకీయ స్థిరత్వం. వలసదారులను స్వాగతించే ప్రభుత్వం వలస విధానం. యుఎఈ ప్రభుత్వం వలసదారులకు ముఖ్యంగా సంపన్నుల కోసం ఒక గోల్డెన్ వీసా జారీ చేస్తోంది. 2019లో ప్రారంభమై, 2022లో విస్తరించిన గోల్డెన్ వీసా కార్యక్రమం 5 నుంచి 10 సంవత్సరాల దీర్ఘకాల నివాసాన్ని అందిస్తుంది. “UAEలో ఆదాయ పన్ను లేకపోవడం, జీవనశైలి కారణంగా సంపన్నులు ఇక్కడికి వస్తున్నారు,” అని నిపుణుడు నూరీ కాట్జ్ ఫోర్బ్స్‌కు చెప్పారు.

రెండో స్థానంలో అమెరికా

అగ్రరాజ్యం అమెరికా ప్రపంచ వాసులను ఇప్పటికీ ఆకర్షిస్తోంది. ట్రంప్ ప్రెసిడెంట్ గా పదవి చేపట్టినప్పటి నుంచి వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ సంపన్నులు వలస వెళుతున్న దేశాల్లో అమెరికా రెండో స్థానంలో ఉంది. 2025లో 7,500 మంది మిలియనీర్లను ఆకర్షించనుంది. EB-5 ఇమ్మిగ్రెంట్ ఇన్ వెస్టర్ ప్రోగ్రామ్ ద్వారా 50 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాలు సృష్టించబడ్డాయని రిపోర్ట్ తెలిపింది.

అమెరికా తర్వాత ఇటలీ, స్విట్జర్లాండ్, సౌదీ అరేబియా ఉన్నాయి. సౌదీ అరేబియా 2025లో 2,400 మంది మిలియనీర్లను ఆకర్షించనుంది, ఇది గత సంవత్సరం కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ.

యూకే పై తీవ్ర ప్రభావం..
ఎక్కువ మంది సంపన్నులు యునైటెడ్ కింగ్‌డమ్ (UK) దేశాన్ని వీడతున్నారు. 2025లో యూకే దేశాన్ని.. 16,500 మంది సంపన్నులను కోల్పోనుంది. దీంతో ప్రపంచంలో అత్యధిక సంపద నష్టం ఈ దేశానికే. ఒకప్పుడు సంపన్నులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా ఉన్న UK, 2016లో బ్రెక్సిట్ తర్వాత ఈ స్థితిని కోల్పోయింది. “వీరు UKని విడిచిపెట్టడం లేదు, కానీ ఇతర దేశాల్లో పాస్‌పోర్ట్ లేదా నివాస అనుమతులు తీసుకుంటున్నారు,” అని కాట్జ్ చెప్పారు. అంటే చాలామంది రెండో దేశంలో ఆర్థిక భద్రత, స్థిరత్వం కోసం తరలి వెళుతున్నారు. అక్కడే తమ భవిష్యత్తు ప్రణాళికను ప్లాన్ చేసుకుంటున్నారు.

ఆసియా, ఐరోపాలో కరిగిపోతున్న సంపద
చైనా 7,800 మంది మిలియనీర్లను కోల్పోనుంది. ఇది రెండో అత్యధిక నష్టం. భారతదేశం 3,500 మందిని, దక్షిణ కొరియా 2,400 మందిని కోల్పోనుంది. యురోప్ దేశాల్లో ఫ్రాన్స్ (-800), స్పెయిన్ (-500), జర్మనీ (-400) సంపన్నులను కోల్పోతున్నాయి. ఐర్లాండ్ (-100), నార్వే (-150), స్వీడన్ (-50) వంటి చిన్న దేశాల్లో కూడా సంపన్నులు వెళ్లిపోతున్నారు.

Also Read: భయం లేకుండా పార్టీ ఎంజాయ్ చేయండి.. ఈ టిప్స్ పాటిస్తే నో హ్యాంగోవర్

సంపన్నుల వలస ఎందుకు?
సంపన్నులు తక్కువ పన్నులు, మెరుగైన జీవనశైలి, రాజకీయ స్థిరత్వం కోసం కొత్త దేశాలను ఎంచుకుంటున్నారు. UAE, అమెరికా వంటి దేశాలు వీటిని అందిస్తున్నాయి. ఈ వలసలు ఆర్థిక వ్యవస్థలపై, ఉద్యోగ సృష్టిపై ప్రభావం చూపుతాయి. సంపన్నులు తమ సంపదతో కొత్త అవకాశాలను అన్వేషిస్తున్నారు.

Related News

India China Flights: అంతా సిద్ధమేనా? వచ్చేనెల నుంచే, భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు

Donald Trump: ఆ వ్యాధితో బాధపడుతున్న ట్రంప్.. అందుకేనా ఇంత తేడాగా ఉన్నాడు?

Botulism Outbreak: ఆ సాండ్‌విచ్ తిన్న కొద్ది సేపట్లోనే ప్రముఖ గాయకుడు మృతి.. ఆ కూరగాయే కారణమా?

Trump Tariffs: ట్రంప్ డబుల్ గేమ్! చైనాకు గడువు, ఇండియాపై భారీ పన్ను

planes collided: విమానంపైకి దూసుకెళ్లిన మరో విమానం.. తగలబడిన విమానాలు, వైరల్ వీడియో

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Big Stories

×