BigTV English

Miss universe: వారికే ప్రాధాన్యత ఇచ్చారు.. అసహ్యంగా మాట్లాడారు.. బాధేసింది: మిస్ రష్యా

Miss universe: వారికే ప్రాధాన్యత ఇచ్చారు.. అసహ్యంగా మాట్లాడారు.. బాధేసింది: మిస్ రష్యా

Miss universe: అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీలు వైభవంగా జరిగాయి. పలు దేశాల నుంచి అమ్మాయిలు ఈ పోటీల్లో పాల్గొని తమ అందాలను ఆరబోశారు. అయితే పోటీల్లో తాను దారుణమైన అనుభవాల్ని ఎదుర్కొన్నానని మిస్ రష్యా అన్నా లిన్నికోవా ఆరోపించారు. తనను చిన్నచూపు చూశారని.. అమెరికా, ఉక్రెయిన్ అభ్యర్థులకు మాత్రమే అధిక ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు.


పోటీలు ప్రారంభమైనప్పటి నుంచి తనను అవమానిస్తూ.. బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. ఉక్రెయిన్‌కు చెందిన సోషల్ మీడియా యూజర్లు తనపై అసహ్యంగా కామెంట్లు చేశారని.. అలాగే తనకు చాలా కాలంగా పరిచయం ఉన్నవారు కూడా నెగిటివ్ కామెంట్లు చేశారని వెల్లడించారు. ఆ సమయంలో తనకు బాధేసిందని చెప్పారు.

ఉక్రెయిన్, స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన అమ్మాయిలు తనపై ఇష్టానుసారంగా కామెంట్లు చేశారని అన్నారు. ఉక్రెయిన్ పౌరురాలిని కావడంతో.. కొందరు తనతో మాట్లాడకుండా దూరంగా ఉన్నారని చెప్పారు.


ఇటువంటి క్లిష్టమైన పరిస్థితిలో వెనిజులాకు చెందిన అమండా డుడామెల్ తనకు అండగా నిలిచే ప్రయత్నం చేసిందని తెలిపారు. తన మంచితనంతోనే పోటీల్లో అమండా రెండో స్థానంలో నిలిచి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

Tags

Related News

Philippines: చిగురుటాకులా వణికిన ఫిలిప్పీన్స్‌.. వరుసగా మూడు భూకంపాలు, 22 మంది మృతి

USA: అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా..

Indonesia News: ఇండోనేషియాలో కూలిన స్కూల్ బిల్డింగ్.. శిథిలాల కింద 65 మంది విద్యార్థులు

Myanmar: మయన్మార్‌లో భూకంపం.. 4.7గా నమోదు, భారత్‌లోనూ ప్రకంపనలు

London News: గాంధీ విగ్రహంపై పిచ్చి రాతలు.. లండన్‌లో వెర్రి చేష్టలు, వెనుకున్నదెవరు?

Lawrence Bishnoi Gang: లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ చుట్టూ ఉచ్చు.. కెనడా సంచలనం నిర్ణయం

Donald Trump: టాలీవుడ్‌కు ట్రంప్ షాక్.. ఇక అమెరికాలో తెలుగు సినిమాలు రిలీజ్ కష్టమేనా?

Pakistan: మీ పాలన మాకొద్దు.. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో తీవ్ర ఉద్రికత్త

Big Stories

×