BigTV English

Indian 2:తిరుప‌తిలో‘ఇండియ‌న్ 2’ … హెలికాప్ట‌ర్‌లో క‌మ‌ల్‌

Indian 2:తిరుప‌తిలో‘ఇండియ‌న్ 2’ … హెలికాప్ట‌ర్‌లో క‌మ‌ల్‌

Indian 2:యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘ఇండియ‌న్ 2’. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం తిరుప‌తి స‌మీపంలోని గండి కోట‌లో జ‌రుగుతుంది. ఈ లొకేష‌న్‌కు క‌మ‌ల్ హాస‌న్ స్పెష‌ల్‌గా హెలికాప్ట‌ర్ ద్వారా రీచ్ అవుతున్నారు. తిరుపతి నుంచి గండికోటకు హీరో అలా వెళ్లటం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతుంది. శంక‌ర్ ఓ వైపు రామ్ చ‌ర‌ణ్ సినిమాను పూర్తి చేస్తూనే ‘ఇండియ‌న్ 2’ సినిమాను కూడా పూర్తి చేస్తున్నారు. ఈ ఏడాది చివ‌ర‌లో లేక‌పోతే వ‌చ్చే ఏడాదిలో సినిమాను విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.


ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలున్నాయి. 1996లో విడుద‌లైన భార‌తీయుడు చిత్రానికి ఇది సీక్వెల్‌గా రూపొందుతోంది. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, సిద్ధార్థ్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మ‌రి ఇందులో క‌మ‌ల్ ద్విపాత్రాభినయంలో క‌నిపిస్తారా! లేదా! అనే తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. ఎక్స్‌పెక్టేష‌న్స్‌కు త‌గ్గ‌ట్టు శంక‌ర్ ‘ఇండియ‌న్ 2’ను హై బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ నిర్మించాలనుకున్నారు. అనౌన్స్‌మెంట్ తర్వాత వాళ్లు తప్పుకోవటంతో లైకా ప్రొడక్షన్స్ రంగంలోకి దిగింది. అనిరుద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Link – https://twitter.com/Kamaladdict7/status/1620454845181476864?s=20&t=sISSXugDJJZ5EHEmQXcsOQ


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×