BigTV English

Twitter: ట్విట్టర్‌లో డబ్బులు.. థ్రెడ్ ఎఫెక్ట్!

Twitter: ట్విట్టర్‌లో డబ్బులు.. థ్రెడ్ ఎఫెక్ట్!
twitter money

Twitter: ట్విట్టర్‌లో కీలక సంస్కరణలు తీసుకురాబోతున్నారు ఎలాన్ మస్క్. వ్యూవర్స్‌ను ఎట్రాక్ట్ చేసే నిర్ణయం తీసుకోనున్నారు. గూగుల్, యూట్యూబ్, ఫేస్ బుక్ మాత్రమే కాదు.. ఇక నుంచి ట్విట్టర్ కూడా డబ్బులిస్తుంది. కంటెంట్ క్రియేటర్స్ కు ఈ ఆప్షన్ ఇవ్వటానికి రెడీ అవుతోంది. ట్విట్టర్ యాడ్ రెవెన్యూలో.. కొంత భాగాన్ని క్రియేటర్లకు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.


ట్విట్టర్‌కు పోటీగా థ్రెడ్ ఎంట్రీ ఇవ్వటం.. వారం రోజుల్లోనే 10 కోట్ల మంది థ్రెడ్ ఫాలోవర్స్ గా మారటంతో ట్విట్టర్ వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ట్విట్టర్ ఖాతాదారులు థ్రెడ్ వైపు వెళ్లకుండా బంపరాఫర్ ప్రకటించనుంది. ఇక నుంచి ట్విట్టర్ కంటెంట్ క్రియేటర్లకు యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని క్రియేటర్లకు చెల్లించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసింది.

ట్విట్టర్‌ విషయంలో ఎలన్ మస్క్ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల..వ్యూవర్స్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పోస్టులు పెట్టే విషయంలో లిమిట్ పెట్టారు. అలాగే అకౌంట్‌ లేనివాళ్లు ట్విట్టర్ చూసే ఆప్షన్‌ను తొలగించారు. దీనివల్ల చాలా మంది ట్విట్టర్‌ను వీడుతున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో మస్క్‌..అప్రమత్తం అయ్యారు. రెవెన్యూ జనరేట్‌తో వ్యూవర్స్‌ను ఆకర్షించే నిర్ణయం తీసుకున్నారు.


Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×