BigTV English

NASA Warning: నాసా హెచ్చరిక.. నేడు భూమి వైపుకు దూసుకొస్తున్న గ్రహశకలం!

NASA Warning: నాసా హెచ్చరిక.. నేడు భూమి వైపుకు దూసుకొస్తున్న గ్రహశకలం!

2024 KN1: కాలం గడుస్తున్నా కొద్దీ భూమిని ఢీ కొట్టే గ్రహశకలం భూమి వైపుకు దూసుకువచ్చేందుకు సమయం దగ్గర పడిందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి .ఈ నేపథ్యంలోనే యూఎస్ అంతరిక్ష సంస్థ నాసా ఒక ప్రమాదకరమైన గ్రహ శకలం భూమిని దగ్గరగా వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అంతరిక్ష సంస్థ నాసా అధికారిక నివేదిక ప్రకారం జూన్ 23 తేదీ ఆదివారం రోజున రాత్రి 11: 39 గంటలకు 2024 KN1 అనే గ్రహ శకలం భూమికి దగ్గరగా రానుంది. అయితే దీని గురించి నాసా ప్రజలను అప్రమత్తం చేసింది.


2024 KN1 గ్రహశకలం 88 అడుగుల పరిమాణంలో ఉంటుందని, గంటకు ఇది 16, 500 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని నాసా వెల్లడించింది. ఈ గ్రహశకలం అమోర్ సమూహానికి చెందినది. ఆదివారం ఇది భూమికి సమీపంగా వస్తుండటంతో నాసా హెచ్చరికను జారీ చేసింది. సాధారణంగా నాసా డాష్ బోర్డ్ భూమికి దగ్గరగా వచ్చే గ్రహశకలాలు, తోక చుక్కలను ట్రాక్ చేస్తుంది. డాష్ బోర్డు.. భూమికి దగ్గరగా వచ్చే గ్రహశకలాలు, తోక చుక్కల పరిమాణంతో పాటు అవి భూమి నుంచి ఎంత దూరంలో ఉంటాయి అన్న వివరాలను సూచిస్తుంది.

Also Read: అమెరికాలో వరద బీభత్సం.. డకోటాలో ఎమర్జెన్సీ


అంతే కాకుండా ఇది భూమికి 7.5 మిలియన్ కిలో మీటర్ల పరిధిలో ఉన్న గ్రహ శకలాలను కూడా ట్రాక్ చేస్తుంది. నాసా ప్రకారం మన గ్రహాలు ఏర్పడిన తర్వాత గ్రహశకలాలు అనేకం మిగిలి ఉన్నాయి. అయితే ఈ గ్రహ శకలాలు అన్నీ ఒకే పరిమాణంలో ఉండవు. ఈ గ్రహ శకలాలు సూర్యుడి నుంచి వేరు వేరు దూరాలలో ఉంటాయి. ఏ రెండు గ్రహ శకలాలు కూడా ఒకేలా ఉండవు. అయితే ఈ గ్రహశకలాల్లో ఇనుము, నికెల్, మట్టి ఉంటాయి.

Tags

Related News

Nepal: నేపాల్‌లో ఇది పరిస్థితి.. ఆర్థిక మంత్రిని నడిరోడ్డుపై వెంబడించి.. కొడుతూ, తన్నుతూ.. వీడియో వైరల్

Gen Z Movement: దారుణం.. నేపాల్ మాజీ ప్రధాని భార్యను తగలబెట్టేసిన నిరసనకారులు

US-Pak: పాకిస్తాన్ లో అమెరికా ఖనిజాన్వేషణ.. భారత్ కి చెక్ పెట్టేందుకేనా?

Nepal Revolt: నేపాల్‌ అధ్యక్షుడు, పీఎం ఇళ్లకు నిప్పు, హెలికాఫ్టర్ల ద్వారా నేతల తరలింపు.. ప్రధాని రాజీనామా

Nepal: సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తేసిన నేపాల్ ప్రభుత్వం.. కానీ, పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా?

Sudan Gurung: నేపాల్ నిప్పుకణిక సుడాన్.. వీడు పిలుపిస్తే ప్రభుత్వానికి వణుకు, ఇంతకీ ఎవరతను?

×