BigTV English

Floods in US: అమెరికాలో వరద బీభత్సం.. డకోటాలో ఎమర్జెన్సీ!

Floods in US: అమెరికాలో వరద బీభత్సం.. డకోటాలో ఎమర్జెన్సీ!

Floods in America’s Ayova: అగ్ర రాజ్యమైన అమెరికాలో భిన్న వాతావరణం నెలకొన్నది. పలు ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వందలాది ఇండ్లు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వరదల్లో చిక్కుకుపోయిన వారిని హెలికాప్టర్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.


అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో వారం రోజుల నుంచి వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దీంతో చాలా కౌంటీలు జలమయమయ్యాయి. వరదలు ముంచెత్తడంతో ప్రజలు భారీగా ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. రాక్ వ్యాలీ ప్రాంతంలో వందలాది ఇండ్లు పూర్తిగా నీటమునిగాయి. సమీపంలోని రాక్ నది పొంగిపొర్లుతోంది. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. వరదల్లో చిక్కుకుపోయినవారిని హెలికాప్టర్లు, బోట్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

భారీ వర్షాలపై స్థానిక మేయర్ కెవిన్ మాట్లాడారు. శనివారం రాత్రి గంటన్నరలోనే నాలుగు అంగుళాల వర్షపాతం నమోదైందని తెలిపారు. ఇక్కడ ఉన్న 21 కౌంటీల్లో విపత్తుగా గవర్నర్ కిమ్ రేనాల్డ్స్ ప్రకటించారు. సియూక్స్ కౌంటీలో అయితే ఎక్కడా కూడా వీధులు కనిపించడంలేదు. ఎటు చూసినా పూర్తిగా వరద నీరే కనిపిస్తున్నది.


సౌత్ డకోటా రాష్ట్రంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. ఈ విషయాన్ని స్థానిక గవర్నర్ క్రిస్టియన్ నొయిమ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆగ్నేయ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇక్కడ దాదాపు 18 అంగుళాల వర్షపాతం నమోదయ్యింది. చాలా ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. సియోక్స్ ఫాల్ లో 7 అంగుళాల వర్షపాతం కురిసింది. ప్రస్తుతం వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టినా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ నొయిమ్ సూచించారు. సోమ, మంగళవారాల్లో ఇక్కడి నదులకు భారీగా వరద రావొచ్చంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Also Read: మరోసారి తండ్రైన ఎలాన్ మస్క్.. మొత్తం సంతానం 12మంది!

మరో విషయమేమంటే.. అమెరికాలోని పలు ప్రాంతాల్లో హీట్ వేట్ కొనసాగుతుంది. వాషింగ్టన్ డీసీలో 37.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వర్జీనియా, ఫిలడేల్ఫియా, న్యూజెర్సీ, కొలంబస్, ఒహైయో, రిచ్ మాండ్, డెట్రాయిట్ లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 1936 తరువాత ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

Heatwave in America
Heatwave in America

Related News

Nepal: నేపాల్‌లో ఇది పరిస్థితి.. ఆర్థిక మంత్రిని నడిరోడ్డుపై వెంబడించి.. కొడుతూ, తన్నుతూ.. వీడియో వైరల్

Gen Z Movement: దారుణం.. నేపాల్ మాజీ ప్రధాని భార్యను తగలబెట్టేసిన నిరసనకారులు

US-Pak: పాకిస్తాన్ లో అమెరికా ఖనిజాన్వేషణ.. భారత్ కి చెక్ పెట్టేందుకేనా?

Nepal Revolt: నేపాల్‌ అధ్యక్షుడు, పీఎం ఇళ్లకు నిప్పు, హెలికాఫ్టర్ల ద్వారా నేతల తరలింపు.. ప్రధాని రాజీనామా

Nepal: సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తేసిన నేపాల్ ప్రభుత్వం.. కానీ, పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా?

Sudan Gurung: నేపాల్ నిప్పుకణిక సుడాన్.. వీడు పిలుపిస్తే ప్రభుత్వానికి వణుకు, ఇంతకీ ఎవరతను?

×