Nepal: నేపాల్ జెన్-జెడ్ ఉద్యమం ప్రభావం ఏ మాత్రం తగ్గలేదు. ఖాట్మండుతోపాటు ప్రధాన నగరాల్లో నాలుగో రోజు నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. పరిస్థితి గమనించిన ఆ దేశ ఆర్మీ.. శుక్రవారం వరకు కర్ఫ్యూ పొడిగించింది. చాలా ప్రాంతాల్లో అల్లర్లు ఇంకా అదుపులోకి రాలేదు. రామెచాప్ జిల్లా జైలు నుండి ఖైదీలు తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో సైన్యం కాల్పులకు దిగడంతో 12 మంది ఖైదీలు గాయపడ్డారు.
నేపాల్‌లో కొనసాగుతున్న ఆందోళన నేపథ్యంలో గురువారం ఉదయం రామెచాప్ జిల్లా జైలు నుండి ఖైదీలు తప్పించుకోవడానికి ప్రయత్నించారు. జైలు గోడలు బద్దలు కొట్టారు. పరిస్థితి గమనించిన ఆర్మీ, కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 12 మంది ఖైదీలు గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతర్గత జైలు గేటు బద్దలుగొట్టి ప్రధాన తలుపు తెరవడానికి ప్రయత్నించ సైన్యం అలర్ట్ అయ్యింది. ఆందోళనలు మొదలైనప్పటి నుంచి జైలు నుంచి ఖైదీలు పారిపోతున్న ఘటనలు వెలుగులోకి రావడంతో జైళ్ల చుట్టూ భద్రతను మరింత పెంచారు.
రామెచాప్ జైలులో 800 మందికి పైగా ఖైదీలు ఉన్నారు. ఖైదీలను నియంత్రించామని, పరిస్థితి అదుపులో ఉందని సైన్యం పేర్కొంది. ఈ విషయాన్ని ఖాట్మండు పోస్ట్ వెల్లడించింది. ఆందోళన మొదలైనప్పటి నుంచి నేపాల్ చరిత్రలో వివిధ జైళ్ల నుంచి 15,000 మంది ఖైదీలు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. బయట పరిస్థితులను గమనించినవారు కొందరు స్వచ్ఛందంగా తిరిగి వచ్చారట. ఇదిలాఉండగా నేపాల్ మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా ఇంట్లో ఉన్న సొరంగం నుండి నగదు, బంగారం భారీగా సైన్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇంటి కింద సొరంగం తరహాలో సెల్లార్ నిర్మించారట. అయితే ఆ ఇంట్లోకి నిరసనకారులు వెళ్లినప్పటికీ, ఈ సొరంగం వద్దకు చేరుకోలేకపోయారు. నిరసనకారుల దాడిలో మాజీ ప్రధాని దేవుబా, అతని భార్య గాయపడిన విషయం తెల్సిందే. సంఘటన తర్వాత నాలుగు గదుల్లో ఉంచిన కరెన్సీ నోట్లు కాలి బూడిదయ్యాయి. ఈ విషయం తెలియగానే దేవువా నివాసాన్ని చుట్టుముట్టారు. వారిని నియంత్రించడానికి ఆర్మీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. అదే సమయంలో మాజీ ప్రధాని శర్మ, కేబినెట్ మంత్రులను వారి వారి భవనాలను సైన్యం హెలికాప్టర్ల ద్వారా మరొక ప్రాంతానికి తరలించింది.
ALSO READ: అమెరికాలో రాజకీయ హింస.. ట్రంప్ సన్నిహితుడు హత్య
దానికి సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సొరంగం నుండి నగడు, నగలు ఎంత తీశారనే సమాచారాన్ని బహిరంగంగా వెల్లడించలేదు సైన్యం. ఇక భారత్-నేపాల్ సరిహద్దు మార్గాన్ని కట్టుదిట్టం చేశారు. ఇరు దేశాల సైన్యం అక్కడికి వచ్చినవారి పత్రాలను పరిశీలిస్తున్నారు. ఇండియాకి చెందినవారిని మాత్రమే బయటకు పంపిస్తున్నారు. దాదాపు మూడు లక్షలకు పైగానే భారతీయులు నేపాల్‌లోని వివిధ ప్రాంతాలలో ఉన్నట్లు తేలింది. బంధువులను సందర్శించడానికి కొందరు, టూరిజం కోసం వెళ్లినవారు మరికొందరు ఉన్నారట.