BigTV English
Advertisement

Floods in Nepal: నేపాల్‌పై ప్రకృతి కన్నెర.. భారీ వరదలకు 20 మంది మృతి..!

Floods in Nepal: నేపాల్‌పై ప్రకృతి కన్నెర.. భారీ వరదలకు 20 మంది మృతి..!

20 Killed in Nepal as Heavy Rain Triggers: నేపాల్‌పై ప్రకృతి కన్నెర చేసింది. ఆ దేశంలో కురిసిన భారీ వరదలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రుతుపవనాల రాకతో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలకు ఆ దేశం అతలాకుతలమైంది. రెండు రోజులుగా కుండపోత వర్షం కురుస్తోంది. ఈ భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడడం, పిడుగులు పడడంతో 20 మంది మృతిచెందినట్లు నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ తెలిపింది.


ఖాట్మండ్‌కు 125 కి.మీల దూరంలో ఉన్న లామ్ జంగ్ జిల్లాలో రాత్రి కురిసిన పిడుగుల వర్షానికి కొండచరియలు విరిగిపడ్డాయి. వరదల ధాటికి కొండచరియలు విరిగిపడడంతో 3 ఇళ్లు కొట్టుకుపోయాయని, ఇద్దరు చిన్నారులతో పాటు మరో నలుగురు మృతి చెందినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. మరో ఘటనలో పిడుగుపాటుకు తొమ్మిది మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

అదే విధంగా నేపాలీకి 500 కి.మీల దూరంలో ఉన్న మోరాంగ్ జిల్లాలో వరదల కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ఆ జిల్లా అధికారి టెక్ కుమార్ రెగ్మి తెలిపారు. దీంతోపాటు కస్కి, తూర్పు నేపాల్ లోని ఓఖల్ దుంగాలో కొండచరియలు విరిగిపడ్డాయి. రంగంలోకి దిగిన సహాయ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. అయితే ప్రతీ ఏడాది వరదలు, కొండచరియలు విరిగిపడడంతో వందల మంది చనిపోవడం ఆందోనకు గురిచేస్తుంది.


Also Read: Maldives President Muizzu: మాల్దీవులు అధ్యక్షుడిపై క్షుద్రపూజలు.. ఇద్దరి అరెస్ట్!

కొండ చరియలు విరిగిపడిన ఘటనలో ఇద్దరు గల్లంతయ్యారు. వీరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు వారి ఆచూకీ ఇంకా తెలియరాలేదని ఎన్డీఆర్ఎంఏ తెలిపింది. గత 17 రోజుల్లో దేశ వ్యాప్తంగా సంభవించిన విపత్తుల కారణంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 33 జిల్లాలకు వరదలు తీవ్ర ప్రభావం చూపాయి.

భారీ వర్షాలకు దేశానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా చాలా చోట్ల కరెంట్ నిలిచిపోయింది. టెలికమ్యూనికేషన్ వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. ఈ ఏడాది అత్యధిక సంఖ్యలో మరణాలు సంభవించినట్లు మంత్రిత్వ శాఖ రికార్డులు చెబుతున్నాయి.

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మేలంచి, ఇంద్రావతి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అటు కొండలు విరిగిపడడం.. ఇటు వరదలు ముంచెత్తడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Also Read: రక్షణశాఖ మంత్రులపై బహిష్కరణ వేటు

భారీ వర్షాలకు ఒక్కసారిగా నదులు ఉప్పొంగడంతో కొండచరియలు ఉన్న ప్రాంతాల్లో వరద ఉధృతి పెరిగింది. ఈ వరదలకు పలు ప్రాంతాల్లో ఇళ్లు కొట్టుకుపోయాయి. గల్లంతైన వారికోసం సహాయక చర్యలు చేపట్టారు. రానున్న రోజుల్లో మరింత భారీ వర్షాలు కురువనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఆ దేశ అధికారులు నదీ పరివాహార ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

Related News

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Big Stories

×