BigTV English

Knife Attack in Germany: జర్మనీలో కత్తితో ఉన్మాది దాడి.. ముగ్గురు మృతి

Knife Attack in Germany: జర్మనీలో కత్తితో ఉన్మాది దాడి.. ముగ్గురు మృతి

New Arrest Made in Knife Attack That Left 3 Dead in Germany: జర్మనీలోని సోలింజన్ పట్టణంలో ఓ బహిరంగ వేడుక జరుగుతోంది. ఏం జరుగుతోందో తెలిసే లోపు ఓ ఉన్నాది కత్తి తీసుకుని దాడులకు పాల్పడ్డాడు. సిటీ సెంటర్ లో ఫెస్టివల్ ఫంక్షన్ వైభవంగా జరుగుతుండగా హఠాత్తుగా ఈ దాడి జరిగింది. అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా .. తొక్కిసలాట జరిగి వందల సంఖ్యలో జనం గాయపడ్డారు. అయితే దాడి జరగగానే ఆ ఉన్మాది జనంలో కలిసిపోయి తప్పించుకున్నాడు. ఈ దాడులకు పాల్పడిన వ్యక్తి ఒక్కడే అని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. నిందితుడు చాలా బలంగా ఉన్నాడని, యువకుడే అని అంటున్నారు. కాగా అనుమానితుడిగా భావిస్తున్న నిందితుడు ప్రస్తుతం పోలీసుల ఆధీనంలో ఉన్నట్లు సమాచారం.


సీసీ ఫుటేజ్ పరిశీలన

ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న పోలీసులు ప్రస్తుతం సీసీ ఫుటేజ్ ని పరిశీలించే పనిలో ఉన్నారు. అయితే నిందితుడు ఏ కారణం లేకుండానే మెడ మీద కత్తితో తీవ్రంగా గాయపరిచాడని పోలీసులు అంటున్నారు. ఉన్మాది దాడికి భయపడిన పబ్లిక్ ఏం జరుగుతోందో అర్థం కాక అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరిని తొక్కుకుంటూ మరొకరు, తోసుకుంటూ మరొకరు ఎట్టకేలకు ఫెస్టివల్ హాల్ దాటుకుని బయటపడ్డారు. పోలీసులు సకాలంలో అక్కడికి అంబులెన్సులు తెప్పించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాగా ఉన్మాదిని పట్టుకునేందుకు నలభై పోలీసు వాహనాలను, ప్రత్యేక పోలీసులను పంపించామని పోలీసు ప్రతినిధి అలెగ్జాండర్ క్రెస్టా తెలిపారు. పట్టుబడ్డ వ్యక్తిని విచారిస్తున్నారు పోలీసులు.


రంగంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్

స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేయడంతో నిందితుడు పట్టుబడ్డాడన్నారు. ఈ మధ్య పబ్లిక్ ఫంక్లన్లలో ఇలాంటి ఉగ్రవాద చర్యలు ఎక్కువవుతున్నాయని..ఉన్మాదిని క్షమించే ప్రసక్తే లేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఏదైనా ఇలాంటి పబ్లిక్ ఫంక్షన్ లలో ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని..అప్పుడు ముందుగానే ఆ నిందితులను పట్టుకునే అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. అసలు నిందితుడి కోసం నగరమంతా జల్లెడ పడుతున్నారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×