BigTV English

Twitter: ఎగిరిపోయిన పిట్ట.. ట్విట్టర్‌కు కొత్త లోగో.. వైదిస్ ఎక్స్?

Twitter: ఎగిరిపోయిన పిట్ట.. ట్విట్టర్‌కు కొత్త లోగో.. వైదిస్ ఎక్స్?
twitter new logo

Twitter: స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిన తరువాత ట్విట్టర్‌‌లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ట్విట్టర్ “X”గా రీబ్రాండ్ అవుతోంది. ప్రస్తుతం ఉన్న ట్విట్టర్ బ్లూబర్డ్ లోగో కూడా మారి దాని స్థానంలో ఎక్స్ లోగో రానుంది. ఈ మార్పులను మస్క్ అధికారికంగా ప్రకటించారు. ట్విట్టర్ మాతృ సంస్థకు X కార్పొరేషన్ అని పేరు కూడా పెట్టారు. ఎక్స్‌ డాట్‌కామ్‌ డొమైన్ సైతం కొనుగోలు చేసి దాని ద్వారా ట్విట్టర్‌కు రీడైరెక్ట్‌ అయ్యేలా చేశారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ కొత్త సీఈవో లిండా యాకరినో ఎక్స్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. X అనేది ట్విట్టర్‌లో హద్దే లేని ఫ్యూచర్ ఇంటరాక్టివిటీని సూచిస్తుందని తెలిపారు.


భవిష్యత్తులో ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌లో ఆడియో, వీడియో ద్వారా ఇంటరాక్ట్‌ అయ్యే అవకాశం ఉంటుందని ట్విట్టర్ ప్రకటించింది. మెసేజింగ్ ఫీచర్లు, పేమెంట్స్, బ్యాంకింగ్ వంటి వివిధ రకాల సర్వీసులు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. యూజర్లు ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవ్వడానికి, ఆలోచనలను పంచుకోవడానికి, వస్తువులు, సేవలను ట్రేడ్ చేయడానికి కూడా వేదికగా మారుతుందన్నారు. ప్రపంచ స్థాయిలో కొత్త అవకాశాలను అన్వేషించగల మోస్ట్ ఇంటరాక్టివ్, డైనమిక్ ప్లాట్‌ఫామ్‌గా ఎక్స్ నిలువనుందని ప్రకటించింది.

ట్విట్టర్ లోగో ఎక్స్‌గా మారుతుందని మస్క్‌ ముందే ట్వీట్ చేశారు. లోగో షేప్‌ సేమ్ ఇప్పటి లోగో లాగానే ఉంటుందని, కాకపోతే పక్షి స్థానంలో X లెటర్‌ వస్తుందని వివరించారు. సాధారణంగా సామర్థ్యానికి, కొత్త ప్రారంభానికి ఎక్స్‌ లెటర్‌ను సింబల్‌గా చూస్తారు. మస్క్ ఈ అక్షరాన్ని స్పేస్‌ఎక్స్‌లో ఆల్రెడీ వాడేశారు.


Related News

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Big Stories

×