BigTV English

First Newyear Celebrations: కొత్తసంవత్సరంలోకి ముందుగా.. చివరిగా అడుగుపెట్టే దేశాలేవో తెలుసా ?

First Newyear Celebrations: కొత్తసంవత్సరంలోకి ముందుగా.. చివరిగా అడుగుపెట్టే దేశాలేవో తెలుసా ?

First Newyear Celebrations: 2023 కి బైబై చెప్పే టైమ్ దగ్గర పడుతోంది. 2024 కి వెల్కం చెప్పడానికి ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్నారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే ఆ అపురూప క్షణాలను సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. న్యూ ఇయర్ అందరికీ ఒకే రోజు మొదలవుతుంది. కానీ కొన్ని గంటల తేడాలో. అసలు ఏ దేశం మొదటగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటుందో తెలుసా?


ప్రపంచ దేశాల్లో కాలమానాల ప్రకారం కాస్త అటు ఇటూగా అంటే ముందు వెనుక న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం అవుతాయి. అలా ఫసిపిక్ దీవులైన టోంగా, సమోవా, కిరిబాటి దేశాలు ముందుగా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతాయి. ఈ దేశాల్లో భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.30 గంటలకి ప్రారంభమవుతాయి. జనావాసాలు లేని హౌలాండ్, బేకర్ దీవులలో అయితే జనవరి 1 సాయంత్రం 5.30 నిముషాలకు ప్రారంభమవుతాయి. ఇక్కడే చివరిగా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో టైమింగ్ తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రారంభం అవుతాయి.

న్యూజిలాండ్‌, జపాన్‌, ఆస్ట్రేలియా సైతం భారత్ కాలమానం ప్రకారం ముందుగానే వేడుకలు నిర్వహిస్తారు. భారత్‌ కాలమానం ప్రకారం న్యూజిలాండ్‌లో ఈరోజు సాయంత్రం వేడుకలు ప్రారంభంకానున్నాయి. జపాన్‌లో భారత్‌ కంటే 3 గంటల ముందు స్టార్ట్‌ అవుతాయి. ఇదే సమయానికి దక్షిణ కొరియా, ఉత్తరకొరియా దేశాలు కూడా కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తాయి. భూటాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ మనకంటే 30 నిమిషాల ముందు కొత్త సంవత్సరంలోకి వెలుతాయి. భారత్ న్యూఇయర్‌ వేడుకలు జరుపుకునే సమయానికే శ్రీలంక వాసులు వేడుకలు చేసుకుంటారు.


భారత్ తర్వాత సుమారు నాలుగున్నర గంటలకు 43 దేశాలు ఒకేసారి కొత్త ఏడాది 2024కి స్వాగతం పలుకుతాయి. నార్వే, ఫ్రాన్స్‌, ఇటలీ లాంటి ఐరోపా దేశాలు.. కాంగో, అంగోలా, కామెరూన్‌ లాంటి ఆఫ్రికా దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. భారత్‌ తర్వాత 5.30 గంటలకు ఇంగ్లండ్‌లో న్యూఇయర్‌ మొదలవుతుంది. భారత కాలమానం ప్రకారం.. జనవరి 1 ఉదయం అమెరికాలోని న్యూయార్క్‌ కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతుంది.

.

.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×