BigTV English

New zealand MP Dance: పార్లమెంటులో డాన్స్ చేసిన ఎంపీ.. బిల్లు చింపేసి కోపంగా నృత్యం

New zealand MP Dance: పార్లమెంటులో డాన్స్ చేసిన ఎంపీ.. బిల్లు చింపేసి కోపంగా నృత్యం

New zealand MP Dance| పార్లమెంటులో సభ జరుగుతుండగా అతి పిన్న వయసు గల ఒక మహిళా ఎంపీ కోపంగా బిల్లు చింపేసింది. ఆ తరువాత తన సంప్రదాయ ఆదివాసీ పాటను కోపంగా పాడుతూ డాన్స్ చేసింది. ఆమెకు మద్దతుగా పార్లమెంటుల లేచి నిలబడి కాసేపు డాన్స్ స్టెప్పులు వేశారు. దీంతో సభను స్పీకర్ వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ దృశ్యాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇదంతా న్యూజిల్యాండ్ పార్లమెంటులో జరిగింది. న్యూజిల్యాండ్ అతి పిన్న వయసు ఎంపీ అయిన ‘హన రహితి కరేరికి మైపీ క్లార్క్’ ఈ డాన్స్ చేశారు.


22 ఏళ్ల హన రహీతీ 2023లో న్యూజిల్యాండ్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆమె తొలిసారి పార్లమెంటులో అడుగు పెట్టిన తరువాతనే ప్రసంగం చేసే సమయంలో అందరిముదు కోపంగా హాకా నృత్యం చేశారు. అప్పుడే ఆమె తొలిసారి ఇంటర్నెట్ లో వైరల్ అయింది. న్యూజిల్యాండ్ లో మావోరి ఆదివాసీ తెగకు చెందిన హన రహీతి తే పతి మావోరి అనే నియోజకవర్గం నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించారు. గత 200 ఏళ్ల న్యూజిల్యాండ్ చరిత్ర చూస్తే ఆమెనే అతి చిన్న వయసు గల ఎంపీ.

Also Read: ‘ఇది మీ దేశం కాదు’.. ఆస్ట్రేలియా పార్లమెంటులో బ్రిటన్ రాజుకు ఘోర అవమానం


అయితే ప్రస్తుత న్యూజిల్యాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లుక్సాన్.. మావోరి ఆదివాసీలకు ఉన్న ప్రత్యేక హక్కులను కాలరాసేందుకు కొత్త చట్టం తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందులో భాగంగానే గురువారం రాత్రి న్యూజిల్యాండ్ పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టారు. ఆ బిల్లు ప్రవేశ పెట్టిన తరువాత పార్లమెంటులో ఎంపీలందరూ ఓటు వేసేందుకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో ఎంపీ హన రహితీ లేచి బిల్లుని చించేసి కోపంగా మవోరి హక (పాట+డాన్స్) నృత్యం చేశారు. బిల్లుకు వ్యతిరేకంగా చాలా మంది ఎంపీలు నిరసన చేస్తూ.. హన రహితీకి మద్దుతు వచ్చారు. అందరూ ఆమెతోపాటు డాన్స్ చేశారు.

పార్లమెంటులో సభా మర్యాదలు ఉల్లంఘించారని చెబుతూ స్పీకర్ గెర్రీ బ్రౌన్ లీ పార్లమెంటు సెషన్ ని వాయిదా వేశారు.

న్యూజిల్యాండ్ అధికార కూటమిలో మూడు పార్టీలున్నాయి. వీటిలో న్యూజిల్యాండ్ నేషనల్ పార్టీ నాయకుడు క్రిస్టఫర్ లూక్సాన్ ప్రధాన మంత్రి పదవిలో ఉన్నారు. 1840 సంవత్సరానికి ముందు.. న్యూజిల్యాండ్ మూల నివాసులైన వారి మావోరి ఆదివాసీలు ఉన్నారు. ఆ సమయంలో బ్రిటీషర్లు ఆ దేశాన్ని ఆక్రమించుకొని పరిపాలన సాగించడంతో మావోరి ఆదివాసీలు తిరుగుబాటు చేశారు. చివరికి 1840లో బ్రిటీషర్లతో మావోరి ఆదివాసీలు సంధి చేసుకున్నారు. దాన్నే 1840 ట్రీటి ఆఫ్ వైటాంగీ అని అంటారు. ఈ ఒప్పందం ప్రకారం.. బ్రిటీష్ ప్రభుత్వం మావోరి ఆదివాసీల ప్రత్యేక హక్కులు ఉంటాయి. వారి భూములు ఇతర జాతి వారు కొనే అధికారం లేదు. దీంతో పాటు మావోరిలకు బ్రిటీష్ ప్రభుత్వం భద్రత కల్పిస్తుంది.

అయితే 1840లో జరిగిన ఒప్పందాన్ని రద్దు చేసేందుకు ప్రస్తుత ప్రధాన మంత్రి లుక్సాన్ కొత్త చట్టం తీసుకురాబోతున్నారు. దీని గురించి గత వారమే ప్రకటన చేశారు. దీంతో సోమవారం వందలాది మావోరి ప్రజలు లుక్సాన్ కు వ్యతిరేకంగా ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ 9 రోజుల పాటు న్యూజిలాండ్ నార్త నుంచి వెల్లింగ్టన్ వరకు సాగుతుందని నిరసనకారులు తెలిపారు.

న్యూజిల్యాండ్ జనాభాలో 20 శాతం అంటే దాదాపు 53 లక్షల మంది మావోరి ఆదివాసీలున్నారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అధికార కూటమిలోని ఇతర రెండు పార్టీలు ఈ బిల్లుని తాము కూడా వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. దీంతో ప్రస్తుతానికి ఈ బిల్లు చట్ట రూపం దాల్చే పరిస్థితులు కనిపించడం లేదు.

ఆస్ట్రేలియాలో కూడా బ్రిటీషర్లే
న్యూజిల్యాండ్ పొరుగు దేశం ఆస్ట్రేలియా కూడా బ్రిటీషర్లు ఆక్రమణ గురైంది. అక్కడి మూల నివాసులను బ్రిటీషర్లు అణచివేశారు. అయితే ఇప్పటికీ ఆస్ట్రేలియా దేశానికి బ్రిటన్ రాజు చీఫ్ గా ఉన్నారు. ఇటీవల బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు అక్కడి పార్లమెంటులో ఆయన ప్రసంగం చేస్తుండగా.. ఒక ఆదివాసీ ఎంపీ కింగ్ చార్లెస్ తన రాజు కాదని అందరి ముందు నిరసన చేసింది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×