Tollywood Movies : టాలీవుడ్ ఇండస్ట్రీలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ ఇచ్చారు. ఇక సినిమాలు మాత్రమే కాదు వివాదాలు కూడా కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఈ ఏడాది టాలీవుడ్ లో వరుస వివాదాలు వినిపించాయి. అందులో కొన్ని మాత్రం కొలిక్కి రాలేదు. మరికొన్ని మరుగయ్యాయి. అయితే ఈ ఏడాది వివాదాలకు కేరాఫ్ గా మారిన ఇండస్ట్రీ టాప్ హైలెట్ న్యూస్ లు ఏంటో ఒకసారి చూసేద్దాం..
రాజ్ తరుణ్ – లావణ్య..
టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనాలకు కేరాఫ్ గా మారిన వివాదాల్లో మొదటగా వినిపించేది.. హీరో రాజ్ తరుణ్ పేరు.. ఈయన లావణ్య అనే అమ్మాయిని ప్రేమించి మోసం చేసినట్లు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగిక ఆరోపణల కేసు హీరో రాజ్ తరుణ్ మెడకు చుట్టుకుంది. తనను పెళ్లి చేసుకొని శారీరకంగా వాడుకొని ఇప్పుడు మాత్రం నాకు సంబంధం లేదు అంటున్నాడు. రాజ్ తరుణ్ తన సొంతం కావాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కేసు ఎన్నో మలుపులు తిరిగింది.. చివరకు రాజ్ తరుణ్ వైపు తప్పు ఉందని పోలీసులు నిర్దారించారు. ఇది ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
జానీమాస్టర్ కేసు..
టాలీవుడ్ ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్నాడు. అతను గత కొంతకాలంగా తన మీద లైంగిక వేదింపులకు పాల్పడుతున్నట్లు మరో మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు తీసుకున్న రాయ దుర్గం పోలీసులు జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశారు.. అంతేకాదు మాస్టర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ లో ఉంచారు. ఈ కేసు ఎన్నో మలుపులు తిరిగింది. చివరకు మాస్టర్ కు ఇటీవలే న్యాయవ్యవస్థ బెయిల్ మంజూరు చేశారు.. ఆ కేసు ఇంకా పూర్తి అవ్వలేదని తెలుస్తుంది.
అల్లు అర్జున్ వివాదం..
అసెంబ్లీ ఎన్నికల్లో నంద్యాల నియోజకవర్గంలో పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కలిసేందుకు అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. ప్రచారం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో వెళ్లడం రాజకీయంగా వివాదాస్పదమైంది. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఓ పార్టీకి అనుకూలంగా ఎలా వ్యవహరిస్తారనే ప్రశ్నలు సంధించారు.. అయితే అల్లు అర్జున్ పర్యటన నేపథ్యంలో స్థానికంగా నంద్యాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన పార్టీల నేతలే కాకుండా మెగా, అల్లు, పవర్ స్టార్ అభిమానుల్లో గందరగోళం నెలకొన్నది. అయితే భారీగా అభిమానులు రావడంతో శాంతి భద్రతల పరిస్థితులకు భంగం కలిగిందని ఎన్నికల కమిషన్ కేసు నమోదు చేసింది. ఆ కేసు ఎన్నో వాయిదాల తర్వాత ఇప్పుడే ఒక కొలిక్కి వచ్చింది. రీసెంట్ గా ఆయనకు ఈ కేసులో ఊరట లభించింది..
నటి హేమ డ్రగ్స్ కేసు..
టాలీవుడ్ ప్రముఖ నటి హేమ ఒక వివాదంలో చిక్కుకోవడం ఆ వివాదం సంచలనం కావడం జరిగింది. బెంగుళూరు రేవు పార్టీలో దొరికినట్లు పోలీసులు వెల్లడించారు.. దాంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని పలు పరీక్షలు నిర్వహించారు. ఈ కేసులో హేమ బెయిల్ పై విడుదలయ్యారు. ఈ వివాదం హేమ కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపింది. బెయిల్ వచ్చిన కూడా ఆ కేసు మాత్రం ఆమెను వదల్లేదని చెప్పాలి..
యూట్యూబర్ హర్ష సాయి..
ప్రేమ పేరుతో మోసం చేసి శారీరకంగా వాడుకుని, సినిమా పేరుతో తన వద్ద రెండు కోట్ల తీసుకున్నాడని, పెళ్లి కోవాలన్నందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఓ యువతి ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పై లైంగిక ఆరోపణల కేసు పెట్టిన సంగతి తెలిసిందే.. ఆ కేసు ఇప్పుడు ఏటో పోయిందో తెలియదు. అతనికి బెయిల్ వచ్చిందని తెలుస్తుంది…