BigTV English

Australia King Charles: ‘ఇది మీ దేశం కాదు’.. ఆస్ట్రేలియా పార్లమెంటులో బ్రిటన్ రాజుకు ఘోర అవమానం

Australia King Charles: ‘ఇది మీ దేశం కాదు’.. ఆస్ట్రేలియా పార్లమెంటులో బ్రిటన్ రాజుకు ఘోర అవమానం

Australia King Charles| బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. సోమవారం అక్టోబర్ 21, 2024 ఉదయం ఆయన అక్కడి పార్లమెంటులో ప్రసంగం ముగిస్తుండగా.. ఆయనకు వ్యతిరేకంగా ఒక సెనేటర్ నినాదాలు చేసింది. ‘ఇది మీ దేశం కాదు.. నువ్వు నా రాజు కాదు’ అంటూ ఆస్ట్రేలియా మహిళా సెనేటర్ లిడియా థార్ప్ నినాదాలు చేస్తూ నిరసనలు చేసింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది ఆమెను బయటికి తీసుకెళ్లారు.


75 ఏళ్ల బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ ప్రస్తుతం ఆస్ట్రేలియా దేశానికి హెడ్ ఆఫ్ ది స్టేట్.. అంటే ఒక రకంగా ఆస్ట్రేలియా కూడా బ్రిటన్ రాజ్యంలో ఒక భాగమే. కానీ 1901 సంవత్సరంలో ఆస్ట్రేలియా దేశానికి బ్రటీషర్ల నుంచి స్వాతంత్ర్యం లభించింది. అంతుకుముందు ఆస్ట్రేలియా దేశం 100 సంవత్సరాలకు పైగా బ్రిటీష్ కాలనీగా, బ్రిటీషర్ల ఆధీనంలో ఉండేది.

బ్రిటీషు వాళ్ల పాలనలో ఆస్ట్రేలియా మూలనివాసులు, ఆదివాసీలు నరకం అనుభవించారు. బ్రిటీషర్ల వారందరినీ బానిసలుగా చూసేవారు. ఆ సమయంలోనే యూరోప్ లోని ఇతర దేశాల వాళ్లు కూడా ఆస్ట్రేలియా భూభాగంలోని వనరుల గురించి తెలుసుకొని అక్కడికి వచ్చేవారు. అలా వచ్చిన యూరోపియన్ దేశస్తులు అక్కడే స్థిరపడిపోయారు. వారందరినీ యూరోపియన్ సెట్లర్స్ అని గతంలో పిలిచేవారు.


Also Read: మెక్ డొనాల్డ్స్ లో వంట చేసిన ట్రంప్!.. ఎన్నికల ప్రచారంలో కీలక ఓటర్లే టార్గెట్

యూరోపియన్లు ఆస్ట్రేలియా దేశాన్ని ఆక్రమించుకన్నాక అక్కడి ఆదివాసీలు, మూల నివాసులను సామూహిక హత్యలు చేశారు. ఈ భయోత్పాతం కారణంగా ఆస్ట్రేలియా ఆదివాసీలు అడవుల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. 1901 సంవత్సరంలో స్వాతంత్ర్యం వచ్చినా ఆస్ట్రేలియా దేశం ఒక రిపబ్లిక్ దేశంలా మార్పు చెందలేదు. దీంతో ఇప్పటికీ ఆస్ట్రేలియా మూలనివాసులకు అక్కడ సమాన హక్కులు లేవు. వారిని తక్కువ స్థాయి పౌరులుగా గుర్తిస్తారు.

ఆస్ట్రేలియా సెనేటర్ (ఎంపీ) లిడియా థార్ప్ కూడా ఆ మూలనివాసుల వర్గానికి చెందినది. 2022లో ఆమె సెనేటర్ గా ఎన్నికల్లో విజయం సాధించింది. సెనేటర్ గా ఆమె చేసిన ప్రమాణ స్వీకరం అప్పట్లో సంచలనంగా మారింది. ఎందుకంటే ప్రమాణ స్వీకారం సమయంలో సెనేటర్లందరూ తాము బ్రిటన్ పరిపాలకులు, రాణి క్వీన్ ఎలిజెబెత్ పట్ల విశ్వాసంగా ఉంటామని ప్రమాణం చేయాలి. సెనేటర్ లిడియా థార్ప్ కూడా ప్రమాణ స్వీకారం అలానే చేశారు. కానీ ఆ క్రమంలో బ్రిటన్ రాణిని ఎద్దేవా చేస్తూ ప్రమాణం చేశారు.

Also Read: బ్రిటీష్ కొలంబియా ఎన్నికల్లో పంజాబీల హవా.. ఏకంగా 14 మంది విజయం!

”మమల్ని బానిసలుగా చేసిన క్వీన్ ఎలిజబెత్ పట్ల విశ్వాసంగా ఉంటానని” సెనేటర్ లిడియా థార్ప్ ప్రమాణ స్వీకరం సమయంలో చెప్పగా.. అప్పటి పార్లమెంట్ స్పీకర్ సీనయర్ సెనేటర్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాణ స్వీకారం పత్రాన్ని ఉన్నది ఉన్నట్లు చదవమన్నారు. బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజెబెత్ మరణం తరువాత ఆమె వారుసుడిగా ఆమె కుమారుడు చార్లెస్ రాజు పదవి చేపట్టారు.

ఇప్పుడు తాజాగా ఆస్ట్రేలియా, సమోఆ ద్వీపాల పర్యటను వెళ్లినప్పుడు సెనేటర్ లిడియా థార్ప్ ఆయనను వ్యతిరేకిస్తూ.. ‘మా భూమిని మాకు తిరిగి ఇచ్చేయాలి. మా నుంచి దోచుకున్నదాని తిరిగి ఇచ్చేయాలి. నువ్వు మా రాజు కాదు. ఇది నీ దేశం కాదు’ అని ఆమె నినాదాలు చేశారు.

1999లో ఆస్ట్రేలియా ప్రజలు ఎలిజెబెత్ రాణిని ఆస్ట్రేలియా హెడ్ గా తొలగించాలని ఓటింగ్ చేశారు. కానీ స్వల్ప తేడాతో ఈ ఓటింగ్ వీగిపోయింది. అలాగే 2023లో ఆస్ట్రేలియా మూలనివాసుల కోసం ఆస్ట్రేలియా రాజ్యాంగంలో ప్రత్యేక చోటు కల్పించాలని వారికి ఒక ప్రత్యేక అసెంబ్లీ ఉండాలని ప్రతిపాదన పార్లమెంటులో వచ్చినప్పుడు.. సెనేటర్లందరూ దాన్ని తిరస్కరించడం గమనార్హం.

Related News

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Big Stories

×