BigTV English

Prakash Raj: చీప్ రాజకీయాలు.. తిరుపతి లడ్డూ వివాదాన్ని వదలని ప్రకాష్ రాజ్

Prakash Raj: చీప్ రాజకీయాలు.. తిరుపతి లడ్డూ వివాదాన్ని వదలని ప్రకాష్ రాజ్

Prakash Raj: తిరుపతి లడ్డూ వివాదాన్ని ఎవరు మర్చిపోయినా.. మర్చిపోకపోయినా.. నటుడు ప్రకాష్ రాజ్ మాత్రం వదిలేలా కనిపించడం లేదు. బీజేపీనే టార్గెట్ చేశాడో.. పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేశాడో తెలియదు కానీ.. ఆ వివాదం మొదలైనప్పటినుంచి  ఇప్పటివరకు ఏకధాటిగా పోస్టులు పెడుతూనే వస్తున్నాడు. కొన్నిసార్లు కౌంటర్లు.. ఇంకొన్నిసార్లు సెటైర్లు.. మరికొన్ని సార్లు క్లాసులు.. ఇలా  ఏ ఒక్కరోజు కూడా ప్రకాష్ రాజ్ పోస్ట్ లేకుండా  అయితే రోజు గడవడం లేదు అని అంటున్నారు నెటిజన్స్.


పవన్ కళ్యాణ్ ఏ విషయం గురించి మాట్లాడితే.. దాని నెక్స్ట్ డేనే ఈయన పోస్టు ఉంటుంది.  తిరుపతి లడ్డూ  వివాదం అంటే.. మత విద్వేషాలు రేకెత్తించకు అన్నాడు.  ఫిల్మ్ ఇండస్ట్రీ.. సనాతన ధర్మం గురించి అపహాస్యం చేయొద్దు అనే అంటే.. స‌నాత‌న ధ‌ర్మ ర‌క్ష‌ణ‌లో మీరుండండి. స‌మాజ ర‌క్ష‌ణ‌లో మేముంటాం అంటూ సెటైర్ వేశాడు. ఇక ఇందులోకి తమిళనాడు రాజకీయాలను లాగాడు. ఇలా ఒకటని చెప్పలేకుండా.. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు. పోస్టులు మాత్రమే కాకుండా ఇంటర్వ్యూలో కూడా పవన్ పై షాకింగ్ కామెంట్స్ చేస్తూ వస్తున్నాడు.

తాజాగా  మరోసారి  ప్రకాష్ రాజ్ తిరుపతి లడ్డూ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.  తిరుపతి లడ్డూపై  రాజకీయ టోపీ పెట్టి ఉన్న పోస్టర్ తో ఇండియా టుడే ఒక ఆర్టికల్ రాసింది. స్వచ్ఛత రాజకీయాలు.. తిరుపతి లడ్డూ వివాదం.. విభజన ముగింపుల కోసం ప్రసాదాన్ని కూడా ఉపయోగించడం అనేది ఆందోళనకరమైన విషయమని వారు రాసుకొచ్చారు.


ఇక ఆ పోస్టర్ ను ప్రకాష్ రాజ్ షేర్ చేస్తూ.. ” ఈరోజు రాజకీయాల చౌకబారుతనం..” అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింటవ్ వైరల్ గా మారింది. ఇక ప్రకాష్ రాజ్ పై నెటిజన్స్ ట్రోల్స్ గుప్పిస్తున్నారు. డబ్బుకోసం ఏదైనా చేయడానికి వెనుకాడడు అని కొందరు.. ఇంకో డ్రామా చేయడానికి తమిళనాడుకు వెళ్ళాడు అని ఇంకొందరు  కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ లడ్డూ వివాదాన్ని ప్రకాష్ రాజ్ ఎప్పుడు ఆపుతాడో చూడాలి. 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×