BigTV English

NOBEL PRIZE : రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం వీరికే!

NOBEL PRIZE : రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం వీరికే!

రాయల్ స్వీడిష్ అకాడమీ ఈ ఏడాది రసాయన శాస్త్రంలో(chemistry) నోబెల్ పురస్కారానికి(Nobel Prize) ముగ్గురిని ఎంపిక చేసింది. ఈ ముగ్గురూ అమెరికాకి చెందిన వారే కావడం విశేషం.అవార్డు పొందిన వారిలో మౌంగి జి.బావెండీ, లూయస్ ఈ బ్రూస్, అలెక్సీ ఎకిమోవ్ ఉన్నారు.నానోటెక్నాలజీలో క్వాంటమ్ డాట్స్ ఆవిష్కరణలో వీరు చేసిన పరిశోధనలకు గానూ వీరికి ఈ సంవత్సరం నోబెల్ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది.


ఇందులో లూయస్ ఈ బ్రూస్ మరియు అలెక్సీ ఎకిమోవ్ 1980లో క్వాంటమ్ డాట్స్ మరియు వాటి యొక్క లక్షణాలకు సంబంధించి విడివిడిగా పరిశోధనలు చేసి విజయవంతమయ్యారు.1993లో మౌంగి బావెండీ క్వాంటమ్ డాట్స్ తయారుచేసే పద్దతుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు.క్వాంటమ్ డాట్స్ నాణ్యతను మెరుగుపరిచారు. నేటి నానోటెక్నాలజీలో వాటి ఉపయోగం కోసం ఇది చాలా ముఖ్యం.
క్వాంటమ్ డాట్స్ అనేవి ప్రస్తుతం QLED టెక్నాలజీ ఆధారంగా కంప్యూటర్ మానిటర్లు,టి.వి స్క్రీన్ లను ప్రకాశిస్తాయి.జీవరసాయన శాస్త్రవేత్తలు,వైద్యులు జీవ కణజాలాన్ని మ్యాప్ చేయడానికి వీటిని ఉపయోగిస్తారు.

క్వాంటమ్ డాట్స్ అనేవి నేటి ఆధునిక యుగంలో మానవజాతికి గొప్ప ప్రయోజనాన్ని తెస్తున్నాయి.భవిష్యత్తులో ఈ క్వాంటమ్ డాట్స్ సౌకర్యవంతమైన ఎలక్ట్రానిక్స్ పరికరాలు, చిన్న సెన్సార్లు, సన్నని సౌరఘటాలు,ఎన్క్రిప్టెడ్ క్వాంటం కమ్యూనికేషన్ కు దోహదం చేస్తాయని పరిశోధకులు విశ్వసిస్తున్నారు.


Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×