BigTV English

North Korea : ఉత్తర కొరియాలో ఇద్దరు విద్యార్ధులు మృతి..ఎందుకంటే ?

North Korea : ఉత్తర కొరియాలో ఇద్దరు విద్యార్ధులు మృతి..ఎందుకంటే ?

North Korea : ఉత్తర కొరియాలో మరో దాష్టీకం వెలుగులోకి వచ్చింది. అక్కడ అధ్యక్షుడు తాను చెప్పిందే వేదంలా అమలు చేస్తున్నారనే విషయం కొత్తేమీ కాదు. ఇతర దేశాల సంస్కృతి తమ దేశంపై పడకుండా కట్టుదిట్టమైన ఆంక్షలు అమలు చేస్తుంటారు. ఈ నిబంధనలను అతిక్రమించిన వారిని కఠినంగా శిక్షిస్తుంటారు. ఇటీవల దక్షిణ కొరియా సినిమాలు, వీడియోలు చూసినందుకు ఇద్దరు విద్యార్థులకు మరణ శిక్ష విధించినట్లు తెలుస్తోంది. రెండు నెలల కిందట జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.


ఉత్తర కొరియాలోని ర్యాంగాంగ్‌ ప్రావిన్స్‌ చైనా సరిహద్దులకు దగ్గరగా ఉంటుంది. ఈ ప్రాంతానికి చెందిన ఇద్దరు హైస్కూల్‌ విద్యార్థులు అక్టోబర్‌లో దక్షిణ కొరియా సినిమాలు, అమెరికన్‌ డ్రామాలు చూశారని వారిపై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ఉత్తర కొరియా అధికారులు వారిపై నేరారోపణ చేసినట్లుగా కొరియన్‌ మీడియాలో కథనాలు వచ్చాయి. ది ఇండిపెండెంట్ వార్తా సంస్థలో ఇవి ప్రముఖంగా రావడం సంచలనం రేపింది.

ఈ ఘటనతో అధికారులు సీరియస్‌ అయ్యారు. ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమించినందుకు వారికి మరణశిక్ష విధించి, బహిరంగంగా కాల్చి చంపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఉత్తర కొరియా చట్టాల ప్రకారం దక్షిణ కొరియాతోపాటు, ఇతర దేశాలకు చెందిన సినిమాలు, డ్రామాలు, వీడియోలు చూడటం, పంపిణీ చేయడం నేరం. ఈ తరహా నేరాలకు పాల్పడే వ్యక్తులు మైనర్లు అయినా సరే.. నిర్దాక్షిణ్యంగా మరణ శిక్ష విధించేలా ఆ దేశం కఠినంగా వ్యవహరిస్తుంది.


Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×