BigTV English

China-Taiwan: మేం మీ కీలు బొమ్మలం కాదు.. చైనాకు తైవాన్ స్ట్రాంగ్ కౌంటర్..

China-Taiwan: మేం మీ కీలు బొమ్మలం  కాదు..  చైనాకు తైవాన్ స్ట్రాంగ్ కౌంటర్..

 


china taiwan conflict latest news

Taiwan strong counter to China(Today latest news telugu): భారత మీడియా చేసిన ఓ ఇంటర్వ్యూ  చైనాకు ఆగ్రహం వచ్చేలా చేసింది. తమ అనుమతి లేకుండా ఎలా చేస్తారంటూ మండిపడింది. తైవాన్ తమ దేశంలో భాగమని అది ప్రత్యేకమైన దేశం కాదని మరోసారి చైనా స్పష్టం చేసింది. అసలేం జరిగిందంటే.. తాజాగా తావాన్ విదేశీ వ్యవరాల మంత్రి జోసఫ్ వూను భారత్ కి చెందిన ఒక టీవీ ఛానల్ ఇంటర్వూ చేసింది. తైవాన్ కి చెందిన అంశాలపై ఆయన మాట్లాడుతూ తైవాన్ స్వతంత్ర దేశమని వ్యాఖ్యానించారు.


దీంతో ఈ ఇంటర్వూ ప్రసారం చేయడం పై భారత్ లోని దౌత్య కార్యాలయానికి ఆగ్రహం తెప్పించింది. తైవాన్ చైనాలో అంతర్భాగం అయినప్పుడు భారత్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని.. తైవాన్ స్వాతంత్య్రానికి వేదికను కల్పిస్తోందని ఆరోపణలు చేసింది. ఇది భారత్ ” వన్- చైనా” అనే దౌత్య పాలన పాటిస్తోందని ఇది దీనికి విరుద్ధమని పేర్కొంది.

ఇటువంటి వాటికి మేము ఏమాత్రం అంగీకరించబోమని తెలిపింది. దీంతో తైవాన్ చైనాకు ఘాటుగానే సమాధానమిచ్చింది. మా విదేశాంగ మంత్రి  జోసఫ్ వూను భారత మీడియా ఇంటర్వూచేస్తే చైనాకు అభ్యంతరం దేనికని ప్రశ్నించింది. భారత్, తైవాన్ దేశాలు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో అంతర్భాగాలు కావని స్పష్టం చేసింది. చైనాకు తాము కీలు బొమ్మలం కాదని .. రెండు దేశాలో నియంతృత్వంలో పనిచేసే మీడియా కాకుండా స్వేచ్ఛగా పనిచేసే మీడియా ఉందని పేర్కొంది. ఆర్ధిక వ్యవస్థ కృంగిపోతుండడంపై బీజింగ్ ఆందోలన చెందాలి.

అంతేగాని పొరగు దేశాలను వేధించకూడదని వ్యాఖ్యానించింది. ఇదలావుంటే తావాన్ 2020 లో నేషనల్ డేను ఏవిధింగా కవర్ చేయాలో దౌత్య కార్యలయం భారత్ మీడియాకు పాఠాలు చెప్పింది. ఈ మేరకు జర్నలిస్టుకు నాడు మెయిల్స్ పంపింది. దీనిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. తమ దేశంలో మీడియాకు స్వేచ్ఛ ఉందని, సరైనది అనుకున్న అంశాలపై రిపోర్ట్ చేస్తుందని, చైనా దౌత్య కార్యాలయానికి భారత్ సమాధానం ఇచ్చింది. అప్పుడు కూడా తైవాన్ భారత్ మీడియాకు అండగా నిలిచింది.

Tags

Related News

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Big Stories

×