BigTV English

Job: ఏడాది పాటు సెలవులు+జీతం.. నో ఆఫీస్.. ఉద్యోగికి బంపర్ ఆఫర్..

Job: ఏడాది పాటు సెలవులు+జీతం.. నో ఆఫీస్.. ఉద్యోగికి బంపర్ ఆఫర్..
china job

Job: లేట్‌గా వస్తే శాలరీ కట్. ముందుగా వెళ్లినా కోతే. లీవ్ లెటర్ ఇవ్వకపోతే జీతం ఫసక్. ఇలా అడ్డదిడ్డంగా రూల్స్ పెడుతూ.. ఉద్యోగి జీతానికి ఎలా చిల్లు పెట్టాలా అని చూస్తుంటాయి చాలా కంపెనీలు. అలాంటిది ఆ సంస్థ ఏకంగా ఏడాది పాటు జీతంతో కూడిన సెలవులు ఇచ్చి పండుగ చేస్కోపో అంది. అయితే, ఈ బంపర్ ఆఫర్ అందరికీ కాదు. లక్కీ డ్రాలో జాక్‌పాట్ ఆఫర్ కొట్టిన ఆ ఒక్క ఉద్యోగికే.


కరోనా కారణంగా ఇన్నాళ్లూ స్తబ్దుగా ఉన్న కంపెనీల కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటున్నాయి. మూడేళ్ల తర్వాత చైనాకు చెందిన ఓ సంస్థ వార్షిక విందును ఏర్పాటు చేసింది. ఎంప్లాయిస్‌కి గ్రాండ్ పార్టీ ఇచ్చింది. చివర్లో ఖతర్నాక్ సర్‌ప్రైజ్ కూడా ప్లాన్ చేసింది.

ఆ పార్టీలో లక్కీ డ్రాను నిర్వహించారు. ఉద్యోగులంతా చిట్టీలు తీయాలి. అందులో ఏముంటే అది వారికే. శాలరీ హైక్, గిఫ్ట్స్, ఫ్రీ ఫుడ్ ఇలా రకరకాల ఆఫర్లతో లక్కీ డిప్ తీశారు. అందులో ఓ ఉద్యోగికి దిమ్మతిరిగే డ్రా వచ్చింది. ఏడాది పాటు జీతంతో కూడిన సెలవులు బహుమతిగా గెలుచుకున్నాడు ఓ మేనేజర్ స్థాయి ఉద్యోగి.


ఆ లక్కీఫెలో కావాలంటే ఏడాది సెలవులు వాడుకోవచ్చు.. లేదంటే, ఆ 365 డేస్ హాలిడేస్‌ను నగదుగా మార్చుకునే ఫెసిలిటీ కూడా కల్పించింది కంపెనీ. ఈ విషయం తెలిసి.. ఆ సంస్థ గురించి తెగ చర్చించుకుంటున్నారు నెటిజన్లు. తమ కంపెనీ కూడా అలాంటి ఆఫర్ ఇస్తే బాగుండంటూ కామెంట్లు పెడుతున్నారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×