E-Paper
Advertisement

Musharraf: పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూత

Musharraf: పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూత
Advertisement

Musharraf: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. ముషారఫ్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈక్రమంలో దుబాయ్‌లోని అమెరికన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యల కారణంగా ఆయన 2016 నుంచి దుబాయ్‌లోనే ఉంటున్నారు. ముషారఫ్ మరణం పట్ల పలువురు దేశాధినేతలు సంతాపం తెలియజేస్తున్నారు.

1943లో ఢిల్లీలో జన్మించిన ముషారఫ్.. దేశ విభజన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి పాకిస్థాన్ వెళ్లిపోయారు. ఆ తర్వాత సైన్యంలో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ పాక్ సైనికదళాల ప్రధానాధికారిగా పనిచేశారు. ఆతర్వాత 1999లో నవాజ్ షరీఫ్ సర్కార్‌పై తిరుగుబాటు చేసి సైనిక పాలకుడిగా పదవి దక్కించుకున్నారు. కార్గిల్ యుద్ధానికి ప్రధాన కారకుడు ఆయనే. 2001లో పాకిస్థాన్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ముషారఫ్..2008 వరకు ఆ పదవిలో కొనసాగారు.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×