E-Paper
Advertisement

Pakistan’s Shaheen-3 Missile Blast : షాహీన్ -3 క్షిపణి విఫలం.. అణుకేంద్రంపై దాడి

Pakistan’s Shaheen-3 Missile Blast : షాహీన్ -3 క్షిపణి విఫలం.. అణుకేంద్రంపై దాడి
Advertisement

Pakistan’s Shaheen-3 Missile Blast : పాకిస్థాన్ కు చెందిన షాహీన్ -3 న్యూక్లియర్ క్లిపణి ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్న డేరా ఘాజీఖాన్ నగరంలో గల అణుకేంద్రాన్ని ఢీ కొట్టినట్లు పాక్ మీడియా వెల్లడించింది. క్షిపణి పేలుడు సమయంలో నగరంలో పెద్ద శబ్దం వినిపించిందని, దాని తీవ్రత 20 కిలోమీటర్ల వరకూ వ్యాపించిందని డీజీ ఖాన్ కమిషనర్ ప్రతినిధి మజర్ షీరానీ ఒక ప్రకటనలో ధృవీకరించారు. డీజీ ఖాన్ నగరంలో అణుకేంద్రం వద్ద క్షిపణి పేలినట్లు అక్కడి అధికారులు ధృవీకరించారు. అయితే తొలుత ఉగ్రదాడి జరిగిందని వచ్చిన వార్తలను వారు తోసిపుచ్చారు.

క్షిపణి పేలుడు నేపథ్యంలో పాకిస్థాన్ ఆర్మీ అప్రమత్తమైంది. ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. మీడియాకు అనుమతి నిరాకరించింది. స్థానికులు ఇళ్లలోనే ఉండాలని సూచించినట్లు సమాచారం. ఈ పేలుడులో ఇంతవరకూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వివరాలేవీ తెలియరాలేదు. కానీ.. సోషల్ మీడియాలో కొందరు షేర్ చేసిన వీడియోల ప్రకారం.. బాలిస్టిక్ క్షిపణి మొదట అణుకేంద్రంపై మిస్ ఫైర్ అయింది. ఇదే పెద్ద పేలుడుగా సంభవించి, దాని శబ్దం 20 కిలోమీటర్ల దూరం వరకూ వినిపించినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పాకిస్థాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారికంగా స్పందించలేదు కానీ.. ఇప్పుడు Xగా మారిన ట్విట్టర్.. ఈ పేలుడుకు సంబంధించి రెండు విభిన్న సిద్ధాంతాలతో సందడి చేస్తోంది. కొందరు పాకిస్థానీ నెటిజన్లు షాహీన్ క్షిపణి పరీక్షలో విఫలమైన తర్వాత.. అనుకోకుండా అణుకేంద్రాన్ని ఢీ కొట్టిందని సూచించారు. మరోవైపు డీజీ ఖాన్ లోని పాకిస్థాన్ అణుకర్మాగారంపై శత్రువుల డ్రోన్ దాడి చేసిందని మరికొందరు పేర్కొంటున్నారు. ఈ రెండింటిలో ఏది నిజమన్నది అధికారులు ధృవీకరించలేదు.

Advertisement

అయితే.. పాక్ క్షిపణి ఫెయిల్ అవడం ఇదే తొలిసారి కాదు. గతేడాది దక్షిణ ఆసియా దేశమైన సింధ్ ప్రావిన్స్ లోని జంషోరో నగరంలో గుర్తుతెలియని పాకిస్థాన్ క్షిపణి కూలిపోయింది. అది పాక్ కు చెందినదేనని చేసిన వాదనలను ప్రభుత్వ అధికారులు తోసిపుచ్చారు. కానీ.. భారత్ కు చెందిన బ్రహ్మోస్ రాకెట్ పొరపాటుగా పొరుగు దేశంలో ల్యాండ్ అయ్యాక పాకిస్థాన్ క్షిపణిని పరీక్షించినట్లు స్వతంత్ర సైనిక పరిశీలకులు పేర్కొన్నారు. 2020లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఉపరితలం నుంచి, సముద్రం నుంచి ప్రయోగించగల బాబర్ 2 మిసైల్ లక్ష్యఛేదనకు ముందే బలూచిస్థాన్‌లో కూలిపోయింది. అణ్వాయుధ సంపత్తి కలిగిన దేశాల్లో పాక్ కూడా ఒకటి.

https://x.com/erbmjha/status/1710310371054244340?s=48

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×