BigTV English

Smart watch : స్మార్ట్‌వాచ్‌.. సీఈవో ప్రాణం నిలిచిందిలా!

Smart watch : స్మార్ట్‌వాచ్‌.. సీఈవో ప్రాణం నిలిచిందిలా!
CEO of Hockey Wales

Smart watch : స్మార్ట్‌వాచ్ విలాసవంతమైన వస్తువు కానే కాదు. ఆరోగ్యాన్ని పెంపొందించే సాధనం. అంతకుమించి ప్రాణాలను నిలబట్టే పరికరం. నిజమే. బ్రిటన్‌కు చెందిన ఓ సీఈవో‌ను గుండెపోటు నుంచి బయటపడేసింది స్మార్ట్‌వాచ్.


హాకీ వేల్స్ సీఈఒ పాల్ వేఫం వయసు 42 ఏళ్లు. దినచర్యలో భాగంగా స్వాన్‌సీలోని తన ఇంటికి సమీపంలో వేకువనే జాగింగ్ చేస్తున్నారు. అంతలో ఛాతీలో నొప్పిగా అనిపించింది. అప్పటికి వ్యాయామం మొదలుపెట్టి 5 నిమిషాలే పూర్తయింది.

నొప్పి తీవ్రమైంది. ఛాతీ బిగపట్టేయడంతో పాటు ఊపిరి ఆడకపోవడంతో అసౌకర్యంతో విలవిలలాడారు. అతి కష్టం మీద స్మార్ట్‌వాచ్ నుంచే భార్య లారాకు సమాచారం అందించగలిగారు. అదృష్టం కొద్దీ ఇంటికి దగ్గరలో ఆయన ఉండటంతో.. లారా వెంటనే కారులో ఆస్పత్రికి తరలించింది.


గుండెనాళాల్లో ఒకటి పూర్తిగా మూసుకుపోవడం వల్లే గుండెపోటు వచ్చినట్టు వైద్యులు గుర్తించి చికిత్స అందించారు. ఆరు రోజుల అనంతరం కోలుకుని.. ఇంటికి తిరిగొచ్చారు పాల్.

స్మార్ట్‌వాచ్ వల్ల ప్రాణాలు నిలిచిన ఉదంతాలు గతంలోనూ ఉన్నాయి. ఆరోగ్య సంబంధిత ఫీచర్లు స్మార్ట్‌వాచ్‌ల్లో ఉండటం వల్ల.. ఇటీవల వీటి వాడకం ఎక్కువైంది. యూజర్ల ఆరోగ్యానికి సంబంధించి లోటుపాట్లను స్మార్ట్‌వాచ్‌లు తెలియజేస్తాయి. యాపిల్ స్మార్ట్‌వాచ్‌లలో అయితే ఫాల్ డిటెక్షన్ వంటి అత్యాధునిక ఫీచర్లూ ఉన్నాయి.

మనకు ప్రమాదం జరిగినా లేక ఆకస్మికంగా కుప్పకూలిపోయినా హెచ్చరికలు పంపుతుంది. వాచ్ ధరించిన వారి లొకేషన్‌ను కూడా షేర్ చేస్తుంది. యాక్సిలరోమీటర్, గైరోస్కోప్ ఆధారంగా ఈ ఫీచర్ పనిచేస్తుంది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×