BigTV English

Omegle : యూజర్లకు షాక్.. ఆన్ లైన్ వీడియో చాట్ వెబ్ సైట్ ఒమెగల్ మూసివేత

Omegle : యూజర్లకు షాక్.. ఆన్ లైన్ వీడియో చాట్ వెబ్ సైట్ ఒమెగల్ మూసివేత

Omegle : ప్రముఖ ఆన్ లైన్ వీడియో చాట్ వెబ్ సైట్ ఒమెగల్ తన కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఒమెగల్ వ్యవస్థాపకుడు లీఫ్ కె- బ్రూక్స్ గురువారం ఒక ప్రకటన చేశారు. 14 ఏళ్లుగా కార్యకలాపాలు సాగించిన ఒమెగల్.. తన కమ్యూనికేషన్ సర్వీస్ పై దాడులు, యూజర్ల అనుచిత ప్రవర్తన కారణంగా వెబ్ సైట్ ను మూసివేస్తున్నట్లు వివరణ ఇచ్చారు.


ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు మారేంతవరకూ, ఒత్తిడి, సంస్థ ఆపరేటింగ్ ఖర్చులు అదుపులోకి వచ్చేంత వరకూ తాము దీనితో పోరాడుతామన్నారు. ఆర్థికంగా, మానసికంగా.. ఒమెగల్ ను నిర్వహించడం సాధ్యంకాదని తేల్చేశారు. లీఫ్ కే బ్రూక్స్ తనకు 18 ఏళ్ల వయసు ఉన్నపుడు ఒమెగల్ ను స్థాపించారు. 14 ఏళ్లుగా దాని కార్యకలాపాలను సాగిస్తూ వచ్చిన అతను.. దీని నిర్వహణతో 30 ఏళ్లకే గుండెపోటుకు గురికాలేనని చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.

14 ఏళ్లుగా ఒమెగల్ ను ఆదరిస్తున్న యూజర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సానుకూల ప్రయోజనాల కోసం ఒమెగల్ ను ఉపయోగించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే.. ఇన్నాళ్లు సేవలందించి.. ఇప్పుడు వెబ్ సైట్ ను డౌన్ చేస్తన్నందుకు అందరూ క్షమించాలని విజ్ఞప్తి చేశారు. 2009లో ఒమెగల్ ప్రారంభమవ్వగా.. అపరిచిత వ్యక్తులతో ఆన్ లైన్ ద్వారా కలుసుకునేందుకు ఎక్కువగా వాడకంలోకి వచ్చింది. 2021లో, మిమియుయుహ్, క్వీన్ యాస్మిన్ వారి వ్లాగ్ సహకారంతో ఒమెగల్‌లో కరోలింగ్ చేశారు.


Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Big Stories

×