BigTV English

PM Modi Address UNGA: సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితి జెనెరల్ అసెంబ్లీ సమావేశాలు.. ప్రసంగించనున్న ప్రధాని మోదీ

PM Modi Address UNGA: సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితి జెనెరల్ అసెంబ్లీ సమావేశాలు.. ప్రసంగించనున్న ప్రధాని మోదీ

PM Modi Address UNGA: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఐక్యరాజ్య సమితి జెనెరల్ అసెంబ్లీ 79వ సమావేశాల్లో ప్రసంగించబోతున్నారు. ఐక్యరాజ్యసమితి జెనెరల్ అసెంబ్లీ 79వ సమావేశాలు సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 30 వరకు జరుగనున్నాయి. ఈ సమావేశాల షెడ్యూల్ ఐరాస మంగళవారం ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం.. ప్రధాని మోదీ సెప్టెంబర్ 26న ప్రసంగం చేయనున్నారు. ఇటీవలే ప్రధాని మోదీ రష్యా, ఆస్ట్రియా దేశాల పర్యటన చేసి తిరిగి వచ్చారు. ఈ రెండు దేశాలతో వ్యాపార, డిఫెన్స్ రంగాలలో అభివృద్ధి కోసం పని చేసేందుకు త్వరలోనే భారత ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనున్నట్లు సమాచారం.


ఐక్యరాజ్య సమితి జెనెరల్ అసెంబ్లీ సమావేశాల్లో పలు దేశాల అధ్యక్షులు లేదా విదేశాంగ మంత్రులు పాల్గొంటారు. వీరి మధ్య ప్రపంచవ్యాప్తంగా ఉన్న భద్రతా సమస్యలు, వాతావరణ మార్పు, తదితర అంశాలపై సెప్టెంబర్ 24న డిబేట్ కూడా జరుగునుంది. ఈ డిబేట్‌ని బ్రెజిల్ దేశం ప్రారంభించడం ముందు వస్తున్న పరంపర. బ్రెజిల్ ప్రతినిధి మాట్లాడిన తరువాత.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పదవీకాలంలో చివరిసారిగా ప్రపంచ దేశాల అధ్యక్షులను ఉద్దేశించి ప్రసంగం చేస్తారు. నవంబర్ నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనుండడంతో.. ఐరాస వేదికగా బైడెన్ చేసే ప్రసంగం కీలకంగా మారింది.

Also Read: భార్య సహా 42 మంది మహిళలను చంపిన సీరియల్ కిల్లర్.. ఫుట్‌బాల్ మ్యాచ్ ఫైనల్ చూస్తుండగా అరెస్ట్!


భారత దేశ ప్రధానిగా మూడోసారి పదవి చేప్పటిన మోదీ, ఇంతకుముందు సెప్టెంబర్ 2021లో ఐరాస జెనెరల్ అసెంబ్లీలో ప్రసంగం చేశారు. అయితే 2023 జూన్ 21న యోగా డే సందర్భంగా ప్రధాని మోదీ ఐరాస ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఆ తరువాత అక్కడి నుంచి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ని కలవడానికి వాషింగ్టన్ వెళ్లారు.

ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జెనెరల్ ఆంటోనియో గుటెరస్ జెనరల్ అసెంబ్లీ సమావేశాలకు ప్రపంచ సమస్యలపై నివేదిక సమర్పించనున్నారు. ఆ తరువాత ఐరాస అధ్యక్షుడు సమావేశాలలో తొలి ప్రసంగం చేయనున్నారు. ప్రపంచ దేశాల మధ్య సహకారం తగ్గిపోతోందని.. భవిష్యత్తులో తీవ్ర సమస్యలు రాకుండా ఉండేందుకు ఈ చర్చలు అవసరమని అయితే దేశాల మధ్య విశ్వసనీయత లోపించిన సందర్భంలో సమస్యల పరిష్కారం చాల క్లిష్టంగా మారిందని ఐక్యరాజ్య సమితి ప్రతినిధి చెప్పారు.

Also Read: గాజాలో ఆగని దాడులు.. ఒక్కరాత్రే 60 మంది మృతి

 

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×