BigTV English

Rishi Sunak : రాజకీయ ‘రిషి’.. సునాక్ లైఫ్ జర్నీ..

Rishi Sunak : రాజకీయ ‘రిషి’.. సునాక్ లైఫ్ జర్నీ..


Rishi Sunak : గ్రేట్ ఇండియా సంతతి వ్యక్తి.. తొలిసారి గ్రేట్ బ్రిటన్ కు అధ్యక్షుడయ్యారు. 200 ఏళ్లు భారతదేశాన్ని ఏలిన బ్రిటిషర్లను.. ఇకపై మనోడు పరిపాలించనున్నారు. రిషి సునాక్ ఏకగ్రీవంగా బ్రిటన్ ప్రధానిగా ఎన్నికవడం భారతీయులందరికీ గర్వకారణం. ఇండియన్ల శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి మరోసారి బలంగా చాటిన సందర్భం.

బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు రిషి సునాక్. ఓడిన చోటే గెలిచి.. లిజ్ ట్రస్ నుంచి పగ్గాలు స్వీకరించనున్నారు. బ్రిటన్ స్థిరత్వం, ఐక్యతే తన తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. తాను ఎంతగానో ప్రేమించే కన్జర్వేటరీ పార్టీకి, దేశానికి సేవ చేసే అవకాశం రావడం తనకు లభించిన గొప్ప గౌరవం అన్నారు. ప్రస్తుతం బ్రిటన్ తీవ్ర ఆర్థిక సవాళ్లను ఫేస్ చేస్తోందని.. వాటిని అధిగమించడానికి, భవిష్యత్తు తరాలను గొప్పగా నిర్మించడానికి.. చిత్తశుద్ధితో, అణుకువతో కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


1980 మే 12న ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌లో పుట్టారు రిషి సునాక్. ఆయన పూర్వీకులు పంజాబ్‌కు చెందిన వారు. మొదట తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లి.. అక్కడి నుంచి యూకే వచ్చి బాగా సెటిల్ అయ్యారు. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీలో ఎంబీఏ చేసి.. కొంతకాలం పలు కంపెనీల్లో ఉద్యోగం చేశారు. స్టూడెంట్ గా ఉన్నప్పుడు కన్జర్వేటివ్‌ పార్టీలో ఇంటర్న్‌షిప్‌ చేశారు. 2014 నుంచి ఫుల్ టైమ్ పాలిటిషియన్ గా మారారు. రిచ్‌మాండ్‌ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. పార్లమెంట్‌లో ఎంపీగా భగవద్గీతపై ప్రమాణం చేసి.. తన భారతీయతను, హిందుత్వాన్ని చాటుకున్నారు. రిషి టాలెంట్ ను గుర్తించిన ప్రధాని బోరిస్ జాన్సన్.. ఆర్థిక శాఖలో చీఫ్‌ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత ఛాన్సలర్ గా ప్రమోషన్.. అటునుంచి కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. తన సామర్థ్యంతో కొద్దిసమయంలోనే రైజింగ్‌ స్టార్‌ మినిస్టర్‌గా బ్రిటన్ లో ఫుల్ పాపులర్ అయ్యారు రిషి.

సునాక్ కు ఆర్థిక రంగంపై మంచి పట్టు ఉంది. కరోనా టైమ్ లో ఆర్థిక మంత్రిగా బిలియన్‌ పౌండ్ల విలువైన అత్యవసర పథకాలను ప్రకటించారు. అన్ని వర్గాలకు అనేక రాయితీలు కల్పించారు. దీంతో.. ఆయన పాపులారిటీ మరింత పెరిగి ప్రధాని స్థాయికి ఎదిగేలా చేసింది. బోరిస్ జాన్సన్ తర్వాత పీఎం రేసులోకి దూసుకొచ్చి.. లిజ్‌ ట్రస్‌కు గట్టిపోటీనిచ్చారు.

లిజ్‌ ట్రస్, రిషి సునాక్‌ మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచింది. ఉన్నత ఆదాయ వర్గాలకు పన్ను తగ్గిస్తామని లిజ్ హామీ ఇస్తే.. సునాక్ మాత్రం పన్ను కోతలతో ఆర్థిక వ్యవస్థ ఆగమాగం అవుతుందని హెచ్చరించారు. అయితే, ఎన్నికల్లో లిజ్ ట్రస్ గెలిచి ప్రధాని అయ్యారు. ఆ వెంటనే మినీ బడ్జెట్ ప్రవేశపెట్టి.. సంపన్నులకు భారీగా రాయితీలు ఇచ్చారు. దీంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితికి వచ్చింది. పార్టీ, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో.. ప్రధాని పదవికి రాజీనామా చేశారు ట్రస్. ఈసారి రేసులో సునాక్ ఒక్కడే నిలవడంతో.. బ్రిటన్ ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రాజకీయ ‘రిషి’.. సునాక్.

Tags

Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×