E-Paper
Advertisement

Pakistan: పుతిన్‌ భారత్ టూర్.. పాకిస్థాన్‌‌లో వణుకు మొదలు, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మున్నీర్‌కు కీలక పదవి

Pakistan: పుతిన్‌ భారత్ టూర్.. పాకిస్థాన్‌‌లో వణుకు మొదలు, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మున్నీర్‌కు కీలక పదవి
Advertisement

Pakistan: ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్‌కు భయం పట్టుకుందా? దూకుడుగా వెళ్తే భారత్ చిక్కుతామని దాయాది దేశం భావిస్తోందా? రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనతో పాక్‌లో గుబులు మొదలైందా? ఈ నేపథ్యంలో ఆర్మీ చీఫ్ ఆసిమ్ మున్నీరుకు కీలక పదవి అప్పగించిందా? రానున్న రోజుల్లో ఆసిమ్ కీలకం కానునున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తోంది.

పుతిన్‌ భారత్ టూర్.. పాకిస్థాన్‌‌లో వణుకు

Advertisement

ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్‌లో కీలక విభాగాల్లో రకరకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భారత్‌ని ఎదుర్కొనడం తమవల్ల కాదని దాయాది దేశానికి  అర్థమైంది. అందుకు అన్నివిధాలుగా ఆర్మీ చీఫ్ ఆసిమ్ కరెక్టుని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కీలక పదవుల్లో ఆయన్ని కూర్చొబెడుతోంది. రేపోమాపో ఆయన ఆదేశ అధ్యక్షుడిగా చక్రం తిప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

పుతిన్ భారత్ పర్యటన వేళ పాకిస్థాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదేశ ఆర్మీ అధిపతి ఆసిమ్‌ మునీర్‌‌కు ఉన్నత పదవి కట్టబెట్టింది. పాకిస్థాన్‌ చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌-CDFగా ఆసిమ్‌ మునీర్‌ను నియమించింది. దీనికి పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆమోదం తెలపడం, ఈ మేరకు అధ్యక్ష కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మున్నీర్‌కు కీలక పదవి

ఆర్మీ‌చీఫ్‌గా మున్నీర్ పదవీ కాలం నవంబర్‌తో ముగిసింది. ఆదేశ ఆర్మీ-నేవీ-ఎయిర్‌ ఫోర్స్ విభాగాలను ఏకీకృతం చేసేందుకు సీడీఎఫ్‌ పదవిని క్రియేట్ చేసింది. దీనికితోడు పాకిస్తాన్ ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ సర్వీసును మరో రెండేళ్ల పొడిగించింది. వచ్చే ఏడాది మార్చి 19 నుండి అమలులోకి వస్తుంది.

ఈ ఏడాది ఫీల్డ్ మార్షల్ హోదా పొందారు ఆసిమ్ మునీర్. ఆర్మీ చీఫ్‌తోపాటు CDF విధులను ఆయన ఏక కాలంలో నిర్వహిస్తారు. 1965లో భారతదేశంతో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్‌కు నాయకత్వం వహించిన జనరల్ అయూబ్ ఖాన్ తర్వాత ఫీల్డ్ మార్షల్ పదవిని పొందిన రెండో సైనిక అధికారి ఆసిమ్ మున్నీరు మాత్రమే.

ALSO READ: రష్యా అధ్యక్షుడు పుతిన్ లైఫ్ స్టయిల్, ప్యాలెస్‌లు ఎన్ని?

పాకిస్థాన్‌లో అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ఆసిమ్ మున్నీర్ ఒకరు. అధ్యక్షుడితో సమానంగా రక్షణ ఉండనుంది. ఆయన్ని ప్రాసిక్యూట్‌ చేసే అవకాశం కూడా ఉండదు.సీడీఎఫ్‌గా ఆసిమ్‌ నియామకానికి ముందు ఆ దేశ వ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. ఆయన్ని ఆ పదవిలో కూర్చోబెట్టడం పాకిస్థాన్ ప్రధాని షరీఫ్‌కి ఇష్టంలేదట.

కావాలనే పాకిస్తాన్ ప్రధాని బహ్రెయిన్‌కు వెళ్లడం, అక్కడి నుండి లండన్‌కు వెళ్లారని అంటున్నారు. ఈ లెక్కన పాకిస్థాన్‌లో మరింత పువర్ ఫుల్ వ్యక్తిగా మారారు మున్నీర్. ముష్రారాఫ్ మాదిరిగా రేపటి రోజున మున్నీర్ ఆ దేశాన్ని పాలించినా ఆశ్యర్యపోనక్కర్లేదని అంటున్నారు.

 

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×