BigTV English

USA Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్.. మృతుల్లో ముగ్గురు తెలుగు వాళ్లు!

USA Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్.. మృతుల్లో ముగ్గురు తెలుగు వాళ్లు!

Road accident n the United States five killed: ఆంధ్రప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుమంది మృతి చెందారు. ఇందులో ఏపీకి చెందిన ముగ్గురు ఉండగా..ఇద్దరు వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. మృతుల్లో ఐదుగురు ప్రవాస భారతీయులు ఉండగా.. ఒక మహిళతోపాటు ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తులు ఉన్నారు.


వివరాల ప్రకారం.. అమెరికాలోని రాండాల్స్ సమీపంలో రాష్ట్ర రహదారిపై దక్షిణ బాన్ హామ్‌కు ఆరు మైళ్ల దూరంలో అమెరికా కాలమానం ప్రకారం సాయంత్రం 6.45 నిమిషాలకు రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్లు టెక్సాస్ పబ్లిక్ సేఫ్టీ వర్గాలు వెల్లడించాయి.

ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఒకరు తిరుపతి జిల్లాలోని గూడురు, ఇద్దరు శ్రీకాళకాస్తికి చెందిన వారు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు.


అయితే మృతుల్లో తిరుపతి జిల్లాలోని గూడురుకు చెందిన తిరుమూరు గోపి, శ్రీకాళహస్తికి చెందిన రాజినేని శివ, హరిత ఉన్నారు. ఈ ప్రమాదంలో హరిత భర్త చెన్ను సాయికి తీవ్రంగా గాయాలైనట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

Also Read: కిమ్ మామా మజాకా.. కోపంతో సౌత్ కొరియా రోడ్లు పేల్చివేత!

ఈ ప్రమాదంపై మృతుల కుటుంబాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం పలువురు సంతాపం తెలిపారు. ఇదిలా ఉండగా, ఇటీవల అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని హైదరాబాద్ వ్యక్తులు ముగ్గురు మరణించిన సంగతి తెలిసిందే.

Related News

Donald Trump: ఆ వ్యాధితో బాధపడుతున్న ట్రంప్.. అందుకేనా ఇంత తేడాగా ఉన్నాడు?

Botulism Outbreak: ఆ సాండ్‌విచ్ తిన్న కొద్ది సేపట్లోనే ప్రముఖ గాయకుడు మృతి.. ఆ కూరగాయే కారణమా?

Trump Tariffs: ట్రంప్ డబుల్ గేమ్! చైనాకు గడువు, ఇండియాపై భారీ పన్ను

planes collided: విమానంపైకి దూసుకెళ్లిన మరో విమానం.. తగలబడిన విమానాలు, వైరల్ వీడియో

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Big Stories

×