BigTV English

Viswambhara : చిరు సెంటిమెంట్ డేట్… విశ్వంభరకు కలిసొచ్చేనా…?

Viswambhara : చిరు సెంటిమెంట్ డేట్… విశ్వంభరకు కలిసొచ్చేనా…?

Viswambhara : గతంలో వచ్చిన ఆచార్య మూవీ భారీ డిజాస్టర్ ను అందుకున్న తర్వాత మెగాస్టార్ చిరంజీవి కథల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకున్నారు. కొంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు అదిరిపోయే స్టోరీతో మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర.. భారీ అంచనాల నడుమ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమా పై మేకర్స్ భారీ హైఫ్ ను క్రియేట్ చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను అందిస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీ నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ఆ టీజర్ భారీగా ట్రోల్స్ కు గురైన విషయం తెలిసిందే.. దీనిపై కాస్త ఫోకస్ పెట్టిన టీమ్ సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంది. తాజాగా కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ లాక్ చేశారు.. ఆ కొత్త రిలీజ్ డేట్ ఏంటో ఒకసారి చూద్దాం..


ఈ విశ్వంభర సినిమాతో భారీ హిట్ కొట్టాలని ఆశల్ని ఈ సినిమా పై పెట్టుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి పెట్టుకున్నాడు. ఈ మూవీ హిట్ అయితే మరో సినిమా తన దగ్గరకు వస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల విడుదల తేదీని వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి దాదాపు షూటింగ్ పూర్తి అయ్యిందని కేవలం ఒక పాట మాత్రమే ఉంది అని డైరెక్టర్ ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే.. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక టీజర్ లో చిరంజీవి లుక్ బాగా నచ్చింది.. చిరు లుక్ ఓకే గానీ కొన్ని యాక్షన్స్ సీన్స్ లలో హాలీవుడ్ సినిమా సీన్లను దింపేశారని టీజర్ పై ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే..

వీఎఫ్ఎక్స్ చీప్‌గా ఉన్నాయని, చుట్టేసిన ఫీలింగ్ కలుగుతోందని, ఇప్పుడున్న పోటీని తట్టుకోవాలంటే ఈ ఎఫెక్ట్ సరిపోదని మెజారిటీ వర్గం అభిప్రాయపడుతోంది. లాప్‌టాప్‌ లలో, సెల్ ఫోన్లలో చూస్తే ఓకే గానీ, పెద్ద తెరపై టీజర్ చూస్తే, చాలా స్పష్టమైన తేడాలు కనిపిస్తున్నాయి. కొందరైతే హాలీవుడ్ సినిమాల విజువల్స్ ని కాపీ కొట్టారంటూ, సాక్ష్యాలతో సహా చూపిస్తున్నారు. ఈ ట్రోల్స్ నుంచి బయటపడాలి అంటే సినిమా గ్రాఫిక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతో ఈ మూవీ థియేటర్లలోకి రావడానికి ఆలస్యం అవుతుంది.


వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ మూవీ సమ్మర్ కు జంప్ అయ్యింది. మే తొమ్మిదిన సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రిలీజ్ డేట్ ను లాక్ చేసినట్లు తెలుస్తుంది. మే 9కి ఓ ప్రత్యేకత ఉంది. చిరంజీవి ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ విడుదలైంది ఆరోజే. భారీ వర్షాలు, వరదల్లో కూడా చిరు సినిమా సూపర్ హిట్ కొట్టింది.. ఇక ఈ మూవీకి జగదేక వీరుడు అతిలోక సుందరి కథకూ ఎక్కడో కనెక్షన్ ఉందని, అందుకే వైజయంతీ మూవీస్ ఇలాంటి ప్రకటన విడుదల చేసిందని టాక్ ఇండస్ట్రీలో నడుస్తుంది. ఏది ఏమైన ఈ ఈ సినిమాతో చిరు, వశిష్ఠ లు హిట్ కొడతారేమో చూడాలి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×