BigTV English

Russia Ukraine War : పుతిన్‌పై హత్యాయత్నం! రష్యాలో రెడ్ అలర్ట్.. జెలెన్‌స్కీ పనేనా?

Russia Ukraine War : పుతిన్‌పై హత్యాయత్నం! రష్యాలో రెడ్ అలర్ట్.. జెలెన్‌స్కీ పనేనా?

Russia Ukraine War : “పుతిన్ చనిపోతారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆగిపోతుంది”.. జెలెన్‌స్కీ ఇటీవలే ఈ సంచలన కామెంట్స్ చేశారు. ఈ మాటలు విని ప్రపంచ దేశాలు షాక్ అయ్యాయి. అసలే ఉక్రెయిన్ పరిస్థితి అస్సలు బాలేదు. అమెరికా సహాయ నిరాకరణ చేస్తోంది. రష్యా మిసైల్స్‌తో విరుచుకుపడుతోంది. ఇలాంటి టైమ్‌లో లేపేస్తే.. జెలెన్‌స్కీని రష్యా లేపేస్తారు కానీ.. అదేంటి పుతిన్ చనిపోతాడని ఆయన జోస్యం చెబుతున్నారని అంతా లైట్ తీసుకున్నారు.


పుతిన్ కారు వెరీ స్పెషల్

రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రయాణించే కారు. ఆరస్ లిమోజిన్ మోడల్. హైసెక్యూరిటీ ఫీచర్స్. ల్యాండ్ మైన్స్ పేల్చినా కారుకు ఏం కాదు. మిసైల్స్ సైతం ఆ ఘోస్ట్ కారును పేల్చలేవు. ఆ కారు ఎటూ వెళ్లినా.. హైటెక్ నిఘా ఉంటుంది. ముందూ వెనకాల పటిష్ట బందోబస్తు. ఆ కారు మీద కాకిని కూడా వాలనివ్వరు. కట్ చేస్తే……


కారులో మంటలు..  ఎందుకు? ఏమిటి? ఎలా?

అధ్యక్షుడు పుతిన్ కారులో మంటలు చెలరేగాయి. కారు దాదాపు తగలబడింది. పుతిన్ కారులో మంటలు చెలరేగాయనే సమాచారంతో ప్రభుత్వ  యంత్రాంగం అలర్ట్ అయింది. ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చి మంటలను ఆర్పేశారు. ఇంతకీ కారులో మంటలు ఎలా చెలరేగాయి? దాడి జరిగిందా? బయటినుంచి ఎలాంటి అటాక్ జరగలేదు. మరి, కారు లోపలే ఏదైనా ఫిక్స్ చేశారా? బ్లాస్ట్ చేశారా? రసాయన దాడి జరిగిందా? ఇలా అనేక అనుమానాలు.

మాస్కోలో జరిగిందీ ఘటన. యావత్ రష్యా ఉలిక్కిపడింది. పుతిన్ పరిస్థితిపై ఆందోళన చెలరేగింది. కానీ, అదృష్టవశాత్తు ఆ సమయంలో కారులో రష్యా అధ్యక్షుడు లేరు. అదే, పుతిన్ ఉండి ఉంటే..?

పుతిన్‌కు స్పాట్ ఫిక్స్ చేశారా?

కారులో చెలరేగిన మంటలు ప్రమాదవశాత్తు వచ్చినవి కావన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రష్యా అధ్యక్షుడికి చెందిన ఆరస్ లిమోజిన్ కారు రష్యా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ హెడ్ క్వార్టర్స్ వద్ద నిలిపినప్పుడు అగ్నికి ఆహుతైంది. గతంలో కూడా మాస్కోలో ఓ కారు బాంబు దాడి జరిగింది. ఆ దాడిలో రష్యా డిఫెన్స్ ఏజెన్సీకి చెందిన ఓ కీలక అధికారి, అతని అసిస్టెంట్ చనిపోయారు. ఇప్పుడు మళ్లీ అదే స్టైల్‌లో కారులో మంటలు చెలరేగాయి. దీంతో రష్యా ఇన్వెస్టిగేషన్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మరింత అప్రమత్తమయ్యాయి. మాస్కోలో అసలేం జరుగుతోంది? ఉక్రెయిన్ సీక్రెట్ ఏజెంట్లు రష్ట్యాలో చొరబడ్డారా? పుతిన్ హత్యకు పన్నాగం పన్నారా? అనే దిశగా ఎంక్వైరీ చేస్తున్నారు.

వార్ మరింత పీక్స్?

పుతిన్ ఆ కారును రెగ్యులర్‌గా వినియోగిస్తారని తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడిపై హత్యాయత్నం జరిగిందని తేల్చి చెబుతున్నారు. కాకపోతే, పుతిన్ ఆ దాడి నుంచి లక్కీగా తప్పించుకున్నారని అంటున్నారు. త్వరలోనే పుతిన్ చనిపోతారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించిన కొన్నిరోజుల్లోనే ఇలా కారు ప్రమాదం జరగడం మామూలు విషయం కానే కాదంటున్నారు. ఇది పక్కాగా ఉక్రెయిన్ పనేనని అనుమానిస్తున్నారు. తాజా ఘటనపై పుతిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. తన సెక్యూరిటీపై ఆందోళన చెందారని అంటున్నారు. పుతిన్‌కు కోపం వస్తే ఎట్టాఉంటాదో ఉక్రెయిన్‌కు మరోసారి చూపించాలని తన ఆర్మీకి ఆదేశాలు ఇచ్చారని కూడా చెబుతున్నారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×