BigTV English

Roja Tweet: దేవుడికి నిద్రలేకుండా చేస్తావా బాబూ – రోజా ట్వీట్

Roja Tweet: దేవుడికి నిద్రలేకుండా చేస్తావా బాబూ – రోజా ట్వీట్

వైసీపీ హయాంలో అవసరం ఉన్నా లేకపోయినా పదే పదే మీడియా ముందుకొచ్చే అధికార పార్టీ నేతల్లో రోజా ఒకరు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆమె చాన్నాళ్లుగా సైలెంట్ గానే ఉన్నారు. నగరి నియోజకవర్గంలో జరిగే వైసీపీ కార్యకలాపాల్లో కూడా ఆమె చురుగ్గా పాల్గొనడం లేదు. అదే సమయంలో సోషల్ మీడియాలో మాత్రం రోజా యాక్టివ్ గా ఉండటం విశేషం. తాజాగా ఓ పేపర్ కటింగ్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ చంద్రబాబుని టార్గెట్ చేస్తూ రోజా ఓ ట్వీట్ వేశారు. అయితే ఇక్కడ ఆమె వైసీపీ ప్రభుత్వంలో మాత్రం అంతా సజావుగానే జరిగిందని చెప్పుకోవడం విశేషం.


భగవంతుడికి విశ్రాంతి లేదు..
తిరుమల శ్రీవారి దర్శనాలు గత కొన్నేళ్లుగా 23 గంటలకు పైగా జరుగుతున్నాయనేది సదరు పత్రిక కథనం. గత కొన్నేళ్లు అంటే గత వైసీపీ హయాంలో కూడా ఇలాగే జరిగాయని ఆ పత్రిక రాసుకొచ్చింది. అయితే రోజా మాత్రం ఇదేదో కూటమి ప్రభుత్వ హయాంలోనే మొదలైనట్టు చెప్పే ప్రయత్నం చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు, చివరికి ఆ దేవ దేవుడికి కూడా నిద్ర లేకుండా పోతోందంటూ.. ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ వేశారు.


సిఫార్సు లేఖలు..
తిరుమలలో స్వామి వారి దర్శనానికి సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత ఇచ్చి, డబ్బు ఉన్నవారికే దర్శన అవకాశం కల్పిస్తున్నారని అన్నారు రోజా. భగవంతుడికి విశ్రాంతి సమయం కూడా లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. అయితే వైసీపీ హయాంలో సిఫార్సు లేఖల సంఖ్య ఏమైనా తగ్గిందా అనే ప్రశ్నకు రోజా దగ్గర సమాధానం లేనట్టుంది. అందుకే ఆమె ఆ లేఖల సంఖ్యను ప్రస్తావించకుండా నిందను మాత్రం కూటమి ప్రభుత్వంపై మోపే ప్రయత్నం చేస్తున్నారు.

వీఐపీ దర్శనాలు

వైసీపీ హయాంలో రోజుకి లక్షమంది భక్తులకు దర్శనాలు కల్పించేవారట. అప్పుడు స్వామివారికి విశ్రాంతి సమయ ఎక్కువగా ఉండేదట. కూటమి వచ్చాక రోజువారీ సాధారణ దర్శనాలు 60 వేలకు పరిమితం అయ్యాయని, అదే సమయంలో స్వామివారికి విశ్రాంతి సమయం మాత్రం తగ్గిందని అంటున్నారు రోజా. వీఐపీ దర్శనాల సంఖ్యను రోజుకి 7వేల నుంచి 10వేలకు పెంచారని ఆరోపించారామె. ఇదేనా కూటమి సనాతన ధర్మం? అని ప్రశ్నించారు. టీటీడీని ప్రక్షాళన చేస్తానని చెప్పిన నేతలు, ఇలాగే ప్రవర్తిస్తుంటారా అని అడిగారు. భగవంతుడు అన్నీ గమనిస్తున్నారని అన్నారు రోజా.

రోజా వ్యాఖ్యలపై కూటమి నేతలు సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందిస్తున్నారు. వైసీపీ హయాంలోనే టీటీడీ దర్శనాల్లో సామాన్యులకు ప్రాముఖ్యత ఇవ్వలేదని, కూటమి వచ్చాక అంతా సెట్ రైట్ అవుతోందని చెబుతున్నారు. త్వరలో శ్రీవారి ఏకాంత సమయం కూడా పెరిగే అవకాశం ఉందని వివరణ ఇస్తున్నారు.

వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్తగా వీఐపీ దర్శనాల సంఖ్యను పెంచడం, సామాన్య భక్తులకు ఇచ్చే టోకెన్లను కుదించడం వంటి ప్రయత్నాలు చేయలేదు. దీనిపై రోజా తీవ్ర ఆరోపణలు చేయడం విశేషం. రోజా వ్యాఖ్యలపై టీటీడీ నేరుగా స్పందిస్తుందా, లేక లైట్ తీసుకుంటుందా అనేది చూడాలి.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×