E-Paper
Advertisement

37 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి!

37 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి!
Advertisement

MiMi Chakraborty:ప్రేమకు కాదేది అనర్హం అన్నట్టుగానే.. పెళ్లికి కూడా వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు ఎంతోమంది భామలు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక నటి 37 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది ఆమె నటి మాత్రమే కాదు, రాజకీయ నాయకురాలు కూడా.. మరి ఆమె ఎవరు? ఎవరిని వివాహం చేసుకుంది? ఆమె వివాహం చేసుకున్న వ్యక్తి బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఇలా పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

37 ఏళ్ల వయసులో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ప్రముఖ హీరోయిన్..

ఆమె ఎవరో కాదు మిమీ చక్రవర్తి (MiMi Chakraborty).. బెంగాల్ నటిగా, తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. ఇప్పుడు 37 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది. మెరైన్ ఇంజనీర్ సిద్దార్థ్ దత్తాతో ఏడడుగులు వేసింది మిమీ చక్రవర్తి. కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో 2026 నవంబర్ 26న కోల్కతాలో ఇద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ లోని కలింపాంగ్ లో డిసెంబర్ 5న సాంప్రదాయ పద్ధతిలో వీరి వివాహ వేడుక జరుగనుంది. పైగా ఈ వివాహ వేడుకలు మూడు రోజులపాటు కొనసాగుతాయని తెలుస్తోంది. ఆ తర్వాత జల్ పాయ్ గురిలో రిసెప్షన్ నిర్వహించనున్నారు.

డిసెంబర్ 11న గ్రాండ్ రిసెప్షన్..

Advertisement

వివాహమనంతరం సినీ, రాజకీయ ప్రముఖుల కోసం డిసెంబర్ 11న కోల్కతాలో గ్రాండ్గా రిసెప్షన్ ఇవ్వనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇందులో చిత్ర పరిశ్రమకు చెందిన స్నేహితులు, సన్నిహితులు, సహచరులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరవ్వనున్నారు. ఇక తన వివాహానికి సంబంధించిన ఫోటోలను ఈమె తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

తెలుపు, బంగారు రంగు దుస్తుల్లో వధూవరులు..

తాజాగా షేర్ చేసిన ఫోటోలలో మిమీ, సిద్ధార్థ్ తెలుపు, బంగారు రంగు దుస్తులు ధరించి పెళ్లి పత్రాలపై సంతకాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు, సినీ ప్రముఖుల నుండి ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఏదేమైనా ఇన్నాళ్ల తర్వాత వైవాహిక బంధం లోకి అడుగుపెట్టి అభిమానులను సర్ప్రైజ్ చేసింది మిమీ చక్రవర్తి.

మిమీ చక్రవర్తి సినిమా కెరియర్..

Advertisement

మిమీ చక్రవర్తి కెరియర్ విషయానికి వస్తే.. దివంగత దర్శకుడు రితూపర్నో గోష్ రూపొందించిన గానెర్ ఒపారే సీరియల్ తో తన కెరీర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత పోస్టు, డ్రాకులా సర్, గ్యాంగ్ స్టార్, భానుప్రియ భూతేర్ హోటల్ వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇటీవల సృజిత్ ముఖర్జీ దర్శకత్వంలో ఎంపరర్ వర్సెస్ శరత్ చంద్ర చిత్రంలో కనిపించిన ఈమె కొన్ని ఓటీటీ షోలలో కూడా కనిపించి సందడి చేసింది.

also read:చెయ్యి చేసుకోబోయిన రోహిత్.. షో నుంచి వెళ్లిపోయిన మిథిలేష్!

పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్..

పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ విషయానికొస్తే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా జాదవ్ పూర్ లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందింది. 17వ లోక్సభ ఎంపీగా బాధ్యతలు చేపట్టిన ఈమె.. 2024 ఫిబ్రవరి 15న తన ఎంపీ పదవికి రాజీనామా చేసింది.

Related News

డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి బయటపెట్టిన అనిల్ రావిపూడి.. కామెడీకి బ్రేక్ పడినట్లేనా?

ఇడుపు కాయితం’ నుంచి మరో మెలోడీ.. పాట వింటే ఫిదా అవ్వాల్సిందే!

వృషకర్మ 100 కోట్ల కలెక్షన్స్ పక్కా… అంత కాన్ఫిడెన్స్ ఏంటీ బ్రో..

కింగ్ 100లో నాగచైతన్య క్యామియో…హైప్ పెంచేసిన చైతూ!

మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి స్టార్ కమెడియన్.. వేణు మాధవ్ తొలి మూవీ సంపాదన?

సంకీర్తనలతో భక్తులను అలరిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

హీరోయిన్లకు షాకిచ్చేలా నిధి అగర్వాల్ హెయిర్ కేర్.. ఇంట్లోనే ఈజీగా!

Big Stories

Advertisement
×