BigTV English

Samsung’s Employees Strike: సౌత్ కొరియాలో జీతాలు పెంచాలని ఉద్యోగుల నిరసన.. శాంసంగ్ చరిత్రలో అతిపెద్ద స్ట్రైక్!

Samsung’s Employees Strike: సౌత్ కొరియాలో జీతాలు పెంచాలని ఉద్యోగుల నిరసన.. శాంసంగ్ చరిత్రలో అతిపెద్ద స్ట్రైక్!

Samsung’s Employees to hold three days Strike: సౌత్ కొరియాలోని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఉద్యోగులు ఉద్యమబాట పట్టారు. జీతాలు పెంచాలని ఆ కంపెనీ ఉద్యోగులు నిరసనలకు తెరతీశారు. శాంసంగ్ కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద స్ట్రైక్ చేపట్టేందుకు పూనుకున్నారు. ఈ మేరకు చాలామంది ఉద్యోగులు మూకుమ్మడి సెలవులు పెట్టి ఆందోళనకు దిగారు.


శాంసంగ్ కంపెనీ యాజమాన్యంతో ఉద్యోగులు చర్చలు నిర్వహించారు. ఈ చర్చలు కాస్త విఫలం కావడంతో దాదానె 6,500 మంది ఉద్యోగులు విధులను బహిష్కరించి 3 రోజుల సమ్మెకు దిగారు. కంపెనీకి వచ్చిన అదనపు లాభాల్లో నుంచి ఉద్యోగులకు రావాల్సిన బోనస్, ఏడాదికి ఒకరోజు అదనపు సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై శాంసంగ్ కంపెనీ యాజమాన్యం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు.

దేశంలోనే అతి పెద్ద యూనియన్ అయిన శాంసంగ్ వర్కర్ల యూనియన్ సోమవారం నుంచి మూడు రోజుల వాకౌట్‌కు వెళ్తుంది. గత నెలలో జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకు యూనియన్ పిలుపునిచ్చింది. శాంసంగ్ 55 ఏళ్ల చరిత్రలోనే అతి పెద్ద సమ్మెగా ఎదుర్కొంటుంది. ఇలా సమ్మెకు వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం.


అత్యంత అధునాతన చిప్‌లు తయారుచేసే కంపెనీలలో ఒకటైన ఇక్కడి ప్లాంట్ ఉత్పత్తికి అంతరాయం కలిగించడమే ఈ సమ్మె లక్ష్యమని యూనియన్ నాయకులు చెబుతున్నారు. ఆ దేశ రాజధాని సియోల్‌కు 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న హ్వాసోంగ్‌లోని సెమీ కండక్టర్ ప్లాంట్ల బయట దాదాపు 6,500 మందితో ర్యాలీ నిర్వహిస్తుందని యూనియన్ లక్ష్యంగా పెట్టుకుందని యూనియన్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ లీ హ్యూన్ కుక్ తెలిపారు. అయితే ఈ సమ్మె కారణంగా శాంసంగ్ పేరు ప్రతిష్టలు దెబ్బతినే అవకాశం ఉందని చెబుతున్నారు.

Also Read: మయన్మార్‌లో నకిలీ ఉద్యోగాల రాకెట్.. భారత్ ఐటీ నిపుణులే టార్గెట్!

అయితే వేతనాల పెంపుపై జనవరి నుంచి కార్మికుల యూనియన్, యాజమాన్యం మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 5.1 శాతం వేతన పెంపును అమలు చేశామని, కానీ యుూనియన్లు అదనపు రోజు వార్షిక సెలవు, పనితీరు ఆధారిత బోనస్‌లు కోరుతున్నాయని యాజమాన్యం వాదించిన సంగతి తెలిసిందే.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×