BigTV English

Shubhanshu Shukla : శుభాంశు శుక్లా సేఫ్ రిటర్న్.. మనోడు చరిత్ర సృష్టించాడు..

Shubhanshu Shukla : శుభాంశు శుక్లా సేఫ్ రిటర్న్.. మనోడు చరిత్ర సృష్టించాడు..

Shubhanshu Shukla : శుభాంశు శుక్లా అంతరిక్షం నుంచి భూమికి సురక్షితంగా తిరిగొచ్చారు. శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు సేఫ్‌గా ల్యాండ్ అయ్యారు. వాళ్లు ప్రయాణించిన క్యాప్సుల్ కాలిఫోర్నియా సమీపంలో పసిఫిక్‌ మహాసముద్రంలో స్ప్లాష్‌ డౌన్‌ అయింది. శుక్లా రిటర్న్స్ తో ఆయన కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ ప్రయాణానికి భారతీయులంతా గర్వపడుతున్నారు.


శుభాంశు శుక్లా ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ లో 18 రోజులు ఉన్నారు. జూన్ 26న సాయంత్రం నాలుగున్నరకు ISSతో డాకింగ్ చేశారు. శుభాంశు యాక్సియం-4 మిషన్‌లో భాగంగా జూన్ 25న స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఈ మిషన్ ఇస్రో, నాసా- యాక్సియం స్పేస్ సంస్థల సహకారంతో జరిగింది. శుక్లా ఈ మిషన్‌కు పైలట్‌గా వ్యవహరించారు.

ISSలో దీర్ఘకాల అంతరిక్ష ప్రయాణాలకు సంబంధించిన శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించడానికి శుభాంశు శుక్లా వెళ్లారు. అతను 7 కీలక ప్రయోగాలు చేపట్టారు. మైక్రోగ్రావిటీలో ఎముకలు, కండరాలు, గుండె, రక్తనాళాలు, రోగనిరోధక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం ఉంటుందో అధ్యయనం చేశారు. మొక్కల పెరుగుదలపై మైక్రోగ్రావిటీ ప్రభావం, కఠిన పరిస్థితుల్లో జీవించగల సూక్ష్మజీవులైన వాటర్ బేర్స్‌పై ప్రయోగాలు, జీవనాధార వ్యవస్థలు, పోషకాహారం సంబంధిత అధ్యయనాల్లో శుభాంశు పార్టిసిపేట్ చేశారు. వెళ్లిన పనిని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసి సురక్షితంగా భూమికి తిరిగొచ్చారు. ఆగస్టు 17న ఇండియాను రానున్నారు. 1984లో వింగ్ కమాండర్ రాకేష్ శర్మ చారిత్రాత్మక అంతరిక్షయానం తర్వాత.. మళ్లీ అంతటి ఖ్యాతి శుభాంశు శుక్లాకే దక్కింది.


శుభాన్షు శుక్లాకు స్వాగతం పలుకుతూ ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. శుక్లా తన అంకితభావం, ధైర్యం, మార్గదర్శక స్ఫూర్తి ద్వారా బిలియన్ల కలలను ప్రేరేపించారని అన్నారు. ఇది భారత్ సొంతంగా చేపట్టబోయే.. మానవ అంతరిక్ష విమాన మిషన్ – “గగన్‌యాన్” వైపు మరో మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు మోదీ.

Related News

Afghan Women: అఫ్ఘాన్ భూకంప శిథిలాల్లో మహిళలు.. బతికున్నా రక్షించకుండా వదిలేసిన మగాళ్లు!

MRI Accident: మెడలో మెటల్ చైన్‌తో ఎంఆర్ఐ గదిలోకి.. క్షణాల్లో ప్రాణం గాలిలోకి.. ఎక్కడంటే?

Donald Trump: భారత్‌తో సంబంధాలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు… కుట్రబుద్ధి ఉన్న చైనాతో..?

Putin: 150 ఏళ్లు బతకొచ్చు.. ఎలాగంటే..! పుతిన్ చెప్పిన సీక్రెట్స్..

China Military Parade: ఆ ముగ్గురు కలిస్తే తట్టుకోవడం కష్టమే.. భయంలో ట్రంప్

India USA: మోదీ మైండ్ గేమ్.. ట్రంప్ చాప్టర్ క్లోజ్! ఇండియా లేకపోతే అమెరికా పరిస్థితి ఇదే..

Big Stories

×