BigTV English

Vande Bharat Bullet Train: జపాన్ బుల్లెట్ ట్రైన్ ఔట్? వందే భారత్ ఇన్.. కిర్రాక్ న్యూస్ అంటే ఇదేనేమో!

Vande Bharat Bullet Train: జపాన్ బుల్లెట్ ట్రైన్ ఔట్? వందే భారత్ ఇన్.. కిర్రాక్ న్యూస్ అంటే ఇదేనేమో!

Vande Bharat Bullet Train: నిన్నటి వరకు ముంబయి – అహ్మదాబాద్ మధ్య జపాన్ బుల్లెట్ ట్రైన్ వస్తుందంటూ చాలా హడావుడి. లక్షల కోట్ల ప్రాజెక్ట్, హై స్పీడ్ రైలు అనీ చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్‌కి బ్రేకులు పడినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే.. ఆ మార్గంలో జపాన్‌ బుల్లెట్ ట్రైన్‌‌కి బదులుగా, భారతీయ రైల్వేలు స్వదేశీ ‘వందే భారత్ బుల్లెట్ వర్షన ని ప్రయోగించబోతున్నాయి. అదే కాక, దీని స్పీడు చూస్తే.. కళ్లెదురుగా గంటకు 250 కిలోమీటర్లు! అదేంటి అంత స్పీడ్ అనుకుంటున్నారా? అయితే ఈ కథనం పూర్తిగా చదవండి.


జపాన్ డిజైన్ ప్లాన్ ఆగిపోయిందా?
జపాన్ సహకారంతో ముంబయి – అహ్మదాబాద్ మధ్య 508 కి.మీ బుల్లెట్ రైలు మార్గాన్ని అభివృద్ధి చేస్తామని కేంద్రం ప్రకటించింది. శింకాన్సెన్ మోడల్ ఆధారంగా దీనిని నిర్మించాలి. అయితే దీని నిర్మాణ వ్యయం తక్షణం 1.1 లక్షల కోట్లను దాటుతోంది. ముఖ్యంగా జపాన్‌ టెక్నాలజీ, ప్రత్యేక రైల్వే కారిడార్, భూసేకరణ వంటి అంశాల వల్ల ఆలస్యం అధికమవుతోంది.

ఈ నేపథ్యంలో.. ఈ ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాకముందే, దేశీయంగా అభివృద్ధి చేసిన వందే భారత్ ట్రైన్‌ను అదే రూట్‌లో ప్రయోగించే దిశగా రైల్వే శాఖ ప్రణాళికలు వేస్తోంది.


వందే భారత్ బుల్లెట్ వెర్షన్ వచ్చేస్తోంది!
ఇప్పటికే వందే భారత్ ట్రైన్స్ 160 కి.మీ వేగంతో నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా మిషన్‌లో భాగంగా, భారతీయ ఇంజినీర్లు పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేస్తున్న వందే భారత్ 2.0 బుల్లెట్ వెర్షన్ టెస్టింగ్ దశలో ఉంది.

ఈ ట్రైన్ స్పీడ్ చూస్తే ఎవరూ ఊహించలేరు. గంటకు 250 కి.మీ వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం ఉంది. దీని ప్రయోగానికి సంబంధించి డిజైన్, మోటార్ టెక్నాలజీ, కంట్రోల్ సిస్టమ్స్ అన్నీ ఇప్పుడు టెస్టింగ్ దశలో సక్సెస్ అయ్యాయి.

జపాన్ ప్లాన్ వెనక్కి… ఇండియా ప్లాన్ ముందుకు!
జపాన్ సహాయంతో తీసుకువచ్చే బుల్లెట్ ట్రైన్‌ను హై స్పీడ్ కారిడార్‌పై మాత్రమే నడపాలి. అంటే, సాధారణ రైలు పట్టాలపై నడిపే వీలు ఉండదు. అందుకోసం ప్రత్యేక మార్గం, భూసేకరణ అవసరం. అందుకే, రైల్వే శాఖ ప్రస్తుతం ఈ ఆలోచనలో పడింది.. విదేశీ టెక్నాలజీ కోసం వేచి చూడాలి..? మనకే ఇలాంటి స్పీడ్‌ ట్రైన్ తయారు చేయగలిగితే.. ఎందుకు కాస్ట్లీ ప్రాజెక్టులవైపు చూడాలని, అందుకే ఇప్పుడు హై స్పీడ్ వందే భారత్ ట్రైన్ రాబోతోంది.

ప్రపంచమే షాక్..
రైల్వే వ్యవస్థలో ప్రపంచమే షాక్ కు గురయ్యల భారతీయ ఇంజనీర్లు నూతన ఆవిష్కరణలు చేపడుతుండడంతో, అంతా అవాక్కవుతున్న పరిస్థితి. ఇప్పటికే వందే భారత్ ట్రైన్ దేశవ్యాప్తంగా హిట్ కొట్టగా, లక్షలాది మంది రైల్వే ప్రయాణికులకు ఇదొక వరంగా మారింది. అలాంటి రైలు ఇప్పుడు 250  కిలోమీటర్ల స్పీడుతో అభివృద్ధి చేయడం అంటే మామూలు విషయం కాదు. రైల్వే వ్యవస్థలో ప్రపంచం తోనే ఇండియన్ రైల్వే పోటీ పడుతుందని రైల్వే అధికారులు అంటున్నారు.

ప్రయాణికులకు కలిగే ప్రయోజనాలు ఇవే!
వందే భారత్ బుల్లెట్ వెర్షన్ ప్రయోగం జరిగితే ప్రయాణికులకు పెద్ద బెనిఫిట్లు రాబోతున్నాయని చెప్పవచ్చు. గంటల ప్రయాణం నిమిషాల్లో పూర్తవుతుంది. విమానానికి పోటీగా రైలు మారుతుంది. తక్కువ టికెట్ ధర, తక్కువ కాలంలో గమ్యస్థానానికి చేరుకోవడం, అత్యాధునిక సదుపాయాలతో, పర్యావరణహిత ట్రైన్ ప్రయాణికుల ముందుకు రానుంది. అదే కాకుండా, దేశీయ టెక్నాలజీపై ఆధారపడటం వల్ల నిర్వహణ వ్యయం తక్కువగా ఉంటుంది.

Also Read: Viral traffic incident: ఇదేం రూల్ బాబోయ్.. ట్రాఫిక్ లైన్ దాటితే మోత మోగడమే.. వీడియో వైరల్!

మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్‌కు ముంబయి-అహ్మదాబాద్ మార్గం తొలి ప్రయోగం?
ప్రస్తుత పథకం ప్రకారం.. వందే భారత్ బుల్లెట్ వెర్షన్‌ను మొదటగా ముంబయి – అహ్మదాబాద్ మార్గం పైనే ప్రయోగించే అవకాశం ఉంది. ఈ మార్గంపై ఇప్పటికే ఫ్రీక్వెంట్ ట్రైన్స్ నడుస్తుండగా, వేగవంతమైన ట్రైన్‌కి అవసరమైన కనెక్టివిటీ, రవాణా లాభాలు కనిపిస్తున్నాయి.

అంతేకాదు, ఈ మార్గం ద్వారా ప్రయాణించే ప్రయాణికులు.. ముఖ్యంగా బిజినెస్ మ్యాన్.. అధిక సంఖ్యలో ఉండటంతో, ఇది వ్యాపారపరంగా సూపర్ హిట్ అయ్యే అవకాశముంది.

కేంద్ర ప్రభుత్వం దిశ మార్చిందా?
ఇప్పటి వరకు కేంద్రం జపాన్ బుల్లెట్ ప్రాజెక్టుపై అధిక శ్రద్ధ చూపింది. జపాన్ ప్రభుత్వం చాలా తక్కువ వడ్డీకే రుణాలను మంజూరు చేసింది. కానీ నిర్మాణంలో వచ్చే ఆలస్యం, ఖర్చులు, ఒత్తిళ్ల నేపథ్యంలో ఇప్పుడు దృష్టి స్వదేశీ వనరులవైపు మళ్లినట్టు తెలుస్తోంది. విదేశీ ఆధారిత బుల్లెట్ ప్రాజెక్ట్‌ కన్నా, స్వదేశీ టెక్నాలజీ ఆధారంగా అభివృద్ధి చేయదగిన ట్రైన్లే దీర్ఘకాలికంగా లాభదాయకంగా ఉంటాయని కేంద్రం భావిస్తోంది.

ఒకప్పుడు బుల్లెట్ ట్రైన్ అనగానే జపాన్ టెక్నాలజీ గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు వందే భారత్ రూపంలో భారతదేశం స్వయంగా ప్రపంచానికి సవాలు విసిరే స్థాయికి చేరుకుంది. విదేశీ ఆధారిత ప్రాజెక్టులకు భరోసా లేకుండా, దేశీయంగా తయారైన హై స్పీడ్ ట్రైన్లతో భారత్ నూతన అధ్యాయాన్ని మొదలుపెడుతోంది. కాగా ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ దీనిని ఇండియన్ రైల్వే అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

Related News

Singapore – Malaysia: మలేసియా, సింగపూర్‌లకు IRCTC సరికొత్త ప్యాకేజ్.. మరీ ఇంత చౌకగానా?

Vande Bharat Train: రైల్వేకు బుర్ర ఉందా? వందేభారత్‌ను ఎవరైనా ఆ రోజు నిలిపేస్తారా?

Rajahmundry to Tirupati Flight: రాజమండ్రి నుంచి తిరుపతికి నేరుగా విమానం.. ఎప్పటి నుంచంటే?

Rail Neer: గుడ్ న్యూస్.. రైల్ నీర్ బాటిల్ ధరలు తగ్గుతున్నాయ్, ఇకపై ఎంతంటే?

Bullet Train: ఏంటీ.. మన బుల్లెట్ ట్రైన్‌కు అడ్వన్స్ బుకింగ్ ఉండదా? మరి రైలు ఎక్కేది ఎలా?

Watch Video: ఫోన్ కొట్టేసిన పోలీసు.. ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది, చివరికి..

UP Man: ఒక రైలు ఎక్కబోయి.. మరో రైలు ఎక్కాడు.. చివరి ప్రాణాలు కోల్పోయాడు!

Woman Train Driver: తొలి లేడీ లోకో పైలెట్ సురేఖ పదవీ విరమణ, ఘన వీడ్కోలు పలికి సిబ్బంది!

Big Stories

×