Somalia: సోమాలియాలో ఉగ్రవాదానికి అడ్డకట్టవేసేందుకు అమెరికా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పోయిన ఏడాది మే నుంచి అమెరికా సైన్యం సోమాలియాలో మోహరించింది. ఉగ్రవాదులతో జరుగుతున్న యుద్ధంలో సోమాలియా సైన్యంతో పాటు అమెరికా సైన్యం కూడా పాల్గొంటుంది. సోమాలియా సైన్యానికి అత్యాధునిక ఆయుధాలు ఇవ్వడంతో పాటు శిక్షణ కూడా ఇస్తోంది.
సోమాలియాలోని గాల్కాడ్ టౌన్‌లో జరిగిన దాడిలో ఇస్లామిక్ అల్ శబాబ్‌కు చెందిన 30 మంది ఉగ్రవాదులు హతమైనట్లు అమెరికా ఆఫ్రికా కమాండ్ వెల్లడించింది. అలాగే దాదాపు 100 మందికిపైగా ఉగ్రవాదులు తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది. అయితే ఈ దాడిలో సాధారణ పౌరులకు మాత్రం ఎటువంటి ప్రమాదం జరగలేదని వివరించింది.