BigTV English
Advertisement

South Korea lithium Battery Plant Blast: సౌత్‌కొరియాలో విషాదం.. లిథియం బ్యాటరీ కంపెనీలో పేలుడు.. 22 మంది మృతి!

South Korea lithium Battery Plant Blast: సౌత్‌కొరియాలో విషాదం.. లిథియం బ్యాటరీ కంపెనీలో పేలుడు.. 22 మంది మృతి!

South Korea Lithium Battery Plant Blast: సౌత్‌కొరియాలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. రాజధాని సియోల్‌లో లిథియం బ్యాటరీ తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందారు. మరొకరి జాడ కనిపించలేదు. చాలామంది కార్మికుల శరీరాలు కాలి బూడిదయ్యాయి.


మృతుల్లో 18 మంది చైనాకు చెందినవారు ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో తొమ్మిది మంది గాయపడ్డారు. అందులో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కంపెనీలో సెకండ్ అంతస్తులో సోమవారం బ్యాటరీల పనితీరును సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. బ్యాటరీలు ప్యాకింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు కార్మికులు ప్రయత్నించి నప్పటికీ అందుబాటులోకి రాలేదు.

ముఖ్యంగా లిథియం బ్యాటరీలు వేడిగా వేగంగా కాలిపోయాయి. నార్మల్ పద్దతుల్లో మంటలను అదుపు చేయడం వారికి కష్టంగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే దాదాపు డజనకు పైగానే ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఘటన జరిగిన సమయంలో అక్కడ మొత్తం 100కు పైగానే కార్మికులు ఉన్నారు. మృతి చెందిన చైనా వాసులు పనుల కోసం సౌత్ కొరియాకు వలస వచ్చారు.


Also Read: హజ్ యాత్రలో 1,300 మంది మృతి.. ఆ దేశస్థులే అత్యధికం

ఘటన విషయం తెలియగానే పరిశ్రమల శాఖకు చెందిన అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఈ ప్రమాదంపై దర్యాప్తుకు ఆదేశించారు. రాత్రి పదిగంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు అంచనా వేస్తున్నారు అధికారులు. సెకండ్ ప్లోర్‌లో దాదాపు 35 వేల లిథియం బ్యాటరీ సెల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఈవీ కార్లు, లాప్‌టాప్‌లకు సంబంధించిన ఎక్కువగా బ్యాటరీలను తయారు చేస్తున్నట్లు సమాచారం.

ఎలక్ట్రిక్ వాహనాలలో ఉపయోగించే లిథియం బ్యాటరీ తయారు చేయడంలో దక్షిణకొరియాది ప్రధాన పాత్ర. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఆయా బ్యాటరీలను ఇక్కడే తయారు చేస్తారు. దక్షిణ కొరియాలో జరిగిన అత్యంత ఘోరమైన ఫ్యాక్టరీ ఘటనలో ఇది ఒకటి. అంతకుముందు 1989లో దక్షిణ జియోల్లా ప్రావిన్స్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. అందులో 16 మంది మరణించగా, 17 మంది గాయపడిన విషయం తెల్సిందే.

Also Read: Kenya Protests: చిచ్చురేపిన కొత్త ఆర్థిక బిల్లు.. కెన్యా పార్లమెంటు భవనానికి నిప్పు

Related News

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Big Stories

×