Big Stories

Korean Countries: కిమ్ ‘చెత్త’ పనులకు సౌత్ కొరియా రివేంజ్..!

Korean Countries Balloons War: ఉత్తర కొరియా చెత్త బెలూన్లకు ప్రతిస్పందనగా సౌత్ కొరియా సరిహద్దుల్లో లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేసింది. కిమ్ సర్కారుకు వ్యతిరేకంగా ప్రసారాలను ప్రారంభించింది. పాప్ సంగీతాన్ని భారీ శబ్దంతో మార్మోగిస్తోంది.

- Advertisement -

క్షిపణులతో పరస్పరం కవ్వించుకునే రెండు కొరియా దేశాలు కొత్తదారులు వెతుక్కుంటున్నాయి. ఇన్ని రోజులు చెత్త విసర్జన పదార్ధాలు నిండిన భారీ బెలూన్‌లను దక్షిణ కొరియాకు పంపి ఉత్తర కొరియా కవ్వించగా, ఇప్పడు సియోల్ అనూహ్య ప్రతిచర్యలకు దిగింది. పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లను సరిహద్దుల వద్ద మోహరించి దక్షిణ కొరియా వ్యతిరేక ప్రచారం చేస్తోంది.

- Advertisement -

గత కొన్ని వారాలుగా వందలాదిగా చెత్తతో నిండిన గాలి బుడగలను పంపుతూ కయ్యానికి కాలు దువ్వుతున్న ఉత్తర కొరియాకు దక్షిణ కొరియా గట్టి జవాబు ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే సరిహద్దులో పెద్ద లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేసి వ్యతిరేక కార్యాక్రమాలను ప్రారంభించింది. సైనిక స్థావరాలు ఉన్న ఉత్తర కొరియా ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా కె-పాప్ సంగీతం, వార్తలతో పాటు మరికొన్ని వ్యతిరేక ప్రసారాలను దక్షిణ కొరియా సైన్యం హోరెత్తిస్తోంది.

Also Read: కెనడాలో దారుణం, భారతీయుడ్ని కాల్చి చంపి..

ఉత్తర కొరియాలో విదేశీ వార్తలు, కె- పాప్ సంగీతం వినడం నేరంగా భావిస్తారు. యువతలో ప్రభుత్వంపై వ్యతిరేక భావాలను కె- పాప్ కలిగిస్తుందని, కె- పాప్ సంగీతం తన అధికారాన్ని బలహీనపరుస్తుందని కిమ్ భావిస్తారు. 2015లో దక్షిణ కొరియా లౌడ్ స్పీకర్లతో ఉత్తర కొరియాపై వ్యతిరేక ప్రచారం చేయగా ప్రతిచర్యగా కిమ్ ప్రభుత్వం ఫిరంగులను పేల్చింది. అప్పట్లో అది ఉద్రిక్త పరిస్థితులకు తావిచ్చింది. మరో సారి ఆ పరిస్థితులే ఎదురైతే ఎదుర్కునేందుకు సంసిద్ధంగా ఉండాలని దక్షిణ కొరియా రక్షణ మంత్రి సైనిక బలగాలను ఆదేశించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News