BigTV English

NASA : అంతరిక్షంలోకి ఆ నలుగురు.. అమెరికా, రష్యా రేర్ కాంబినేషన్..

NASA : అంతరిక్షంలోకి ఆ నలుగురు.. అమెరికా, రష్యా రేర్ కాంబినేషన్..
nasa

NASA : నాసా మరో ప్రయోగం చేపట్టింది. భూమి చుట్టు చక్కర్లు కొడుతున్న ఇంటర్నేషనల్ స్పేస్‌ స్టేషన్‌కు నలుగురు అస్ట్రోనాట్స్‌ బయలుదేరారు. అమెరికాలోని కేప్‌ కెనవెరాల్‌లోని కెనడీ స్పేస్ సెంటర్‌ నుంచి స్పేస్‌ ఎక్స్‌ రాకెట్ ఫాల్కన్ 9 నింగిలోకి దూసుకెళ్లింది. ఈ నలుగురు ఆదివారం స్పేస్ స్టేషన్‌కు చేరుకోనున్నారు.


స్పేస్‌ ఎక్స్‌కు సంబంధించి ఇది ఏడో క్రూ మిషన్‌. నాసా నుంచి వెళ్ళిన స్పేస్ ఎక్స్ రాకెట్ లో ప్రయాణిస్తున్న నలుగురు అస్ట్రోనాట్స్‌.. నాలుగు దేశాల నుంచి వచ్చారు. ఇలా నాలుగు దేశాలకు చెందిన వాళ్ళను స్పేస్ లోకి పంపించడం అమెరికాకు ఇదే మొదటిసారి. డెన్మార్క్, జపాన్, అమెరికా, రష్యాలకు చెందిన ఈ నలుగురు వ్యోమగాములు ఆరు నెలల పాటూ INSలో విధులు నిర్వహించనున్నారు. ఇంతకు ముందు ఉన్నవారి ప్లేస్ లో వీళ్ళు వెళుతున్నారు.

అస్ట్రోనాట్స్‌ స్పేస్‌ స్టేషన్‌ వరకు చేరుకునే బాధ్యత స్పేస్‌ ఎక్స్‌ తీసుకుంది. కాలిఫోర్నియా సెంటర్‌ నుంచి ఎప్పటికప్పుడు ఆటోమెటిక్ మాన్యువర్స్‌ను స్పేస్‌ ఎక్స్‌ టీమ్‌ పరిశీలించనుంది. ఇక నాసా టీమ్‌ INS ఆపరేషన్స్‌ను హ్యూస్టన్‌ సెంటర్‌ నుంచి పరిశీలిస్తారని నాసా ప్రకటించింది. డ్రాగన్‌ ఫ్లైట్‌ INS డాకింగ్ అయ్యే విజువల్స్‌ను ఎప్పటిలానే లైవ్‌ స్ట్రీమింగ్ చేస్తామని నాసా తెలిపింది.


ప్రస్తుతం వెళ్లిన నలుగురు అస్ట్రోనాట్స్‌కు క్రూ-7గా పిలుస్తున్న నాసా.. వీరంతా కొత్త సైంటిఫిక్ రిసెర్చ్‌ చేస్తున్నట్టు తెలిపారు. స్పేస్‌ స్టేషన్ బయట ఉన్న పలు రకాల శాంపిల్స్ సేకరిస్తారని.. అంతేగాకుండా స్పేస్ ఫ్లైట్‌ సమయంలో మనుషుల ప్రవర్తన తీరుపై కూడా అధ్యయనం చేయనున్నట్టు ప్రకటించింది.

నాసాకు చెందిన జాస్మిన్ మోఘ్ బెలి ఈ మిషన్ కు కమాండర్ గా ఉన్నారు. మెరైన్ పైలట్ గా విధులు నిర్వహిస్తున్న జాస్మిన్ మొదటిసారి అంతరిక్షంలోకి వెళుతున్నారు. ఇక డెన్మార్క్ నుంచి ఆండ్రియాస్ మొగెన్సెన్, జపాన్ నుంచి సతోషి పురుకావా, రష్యాకు చెందిన కాన్ స్టాంటిన్ బొరిసోవ్‌లు స్పేస్‌ స్టేషన్‌లో అడుగు పెట్టనున్నారు.

Related News

planes collided: విమానంపైకి దూసుకెళ్లిన మరో విమానం.. తగలబడిన విమానాలు, వైరల్ వీడియో

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

Big Stories

×