E-Paper
Advertisement

మత్స్యకారుడిపై ఆక్టోపస్ దాడి.. ముఖాన్ని చుట్టేసి చిత్రవధ.. వీడియో వైరల్!

మత్స్యకారుడిపై ఆక్టోపస్ దాడి.. ముఖాన్ని చుట్టేసి చిత్రవధ.. వీడియో వైరల్!
Advertisement

Octopus Attack: సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడికి ఊహించని షాక్ తగిలింది. నీటి నుంచి బయటకు తీసిన ఆక్టోపస్ అనూహ్యంగా అతడి ముఖంపై దాడి చేసింది. సదరు వ్యక్తి దానిని తీసేందుకు ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి.

అసలేం జరిగిందంటే?

ఫిలిప్పీన్స్ తీర ప్రాంతంలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. జెస్సర్ సెర్వాంటెస్ అనే మత్స్యకారుడు.. చిన్న పడవలో చేపల వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో తను వేసిన గాలానికి అక్టోపస్ చిక్కింది. దానిని పడవలోకి లాగుతున్న క్రమంలో వల నుంచి అది బయటపడి.. అతడి ముఖాన్ని గట్టిగా పట్టుకుంది. దీంతో ఊపిరి ఆడక దాన్ని వదిలించుకోవడానికి అతడు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

Advertisement

వెదురు కర్రతో పోరాడి..

అక్టోపస్ తన పట్టును మరింత బిగిస్తుండటంతో అతడు ప్రాణ భయంతో ఊక్కిరిబిక్కిరి అయ్యాడు. ఈ క్రమంలో ఎదురుగా ఉన్న వెదురు బొంగును తీసుకొని అక్టోపస్‌పై ఎదురుదాడికి దిగాడు. దానిని కర్రతో కొడుతూ ముఖం నుంచి విడిపించే ప్రయత్నం చేశాడు. దెబ్బల దాటికి ఆక్టోపస్ తన పట్టు సడలించడంతో వెంటనే దాన్ని ముఖం మీద నుంచి బలంగా లాగేశాడు. అనంతరం తిరిగి సముద్రంలోకి విసిరేశాడు.

మత్స్యకారుడి రియాక్షన్

Advertisement

కాగా, ఆక్టోపస్ దాడి గురించి జెస్సర్ స్పందించాడు. దానిని అడ్డుకోవడం చాలా కష్టమైందని వాపోయాడు. అది తన ముఖాన్ని చీల్చేసినంత పని చేసిందని ఆందోళన వ్యక్తం చేశాడు. సమయానికి ఎదురుగా కర్ర కనిపించడంతో ఆక్టోపస్ ను నియంత్రించడం సాధ్యమైనట్లు పేర్కొన్నారు. ముఖంపై ఎలాంటి ప్రమాదకర గాయాలు లేకుండా బయటపడటం చాలా సంతోషంగా ఉందని జెస్సర్ చెప్పుకొచ్చారు.

Also Read: వీడు మామూలోడు కాదు.. రూ.5 లక్షల కోసం కిడ్నాప్ డ్రామా.. చివరికి భలే బుక్కయ్యాడు!

అక్టోపస్ పట్టు ఎంత ప్రమాదమంటే?

సాధారణంగా అక్టోపస్‌లు చాలా బలంగా దాడి చేస్తాయి. వాటి తండకాలపై ఉండే పట్టులు (Suckers) ఎంతటి దృఢమైన జీవినైనా గట్టిగా అట్టి పట్టి ఉంచుతాయి. అంతేకాకుండా ఇవి ఏ ఉపరితలాన్నైనా గట్టిగా పట్టుకోగలవని నిపుణులు చెబుతున్నారు. ఇవి తమ కాళ్లను చాలా వేగంగా కదుపుతాయని పేర్కొన్నారు. కాగా, ఫిలిప్పీన్స్ సముద్ర తీర ప్రాంతాల్లో కొకోనట్ అక్టోపస్, మిమిక్ అక్టోపస్‌లతో పాటు అత్యంత విషపూరితమైన బ్లూ-రింగ్డ్ అక్టోపస్‌లు కూడా విస్తృతంగా సంచరిస్తుంటాయి.

Also Read: ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్ రిలీఫ్.. జైలు నుంచి ఆస్పత్రికి.. పాక్ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

Tags

Related News

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రం.. భారత్ ఫార్మా కంపెనీపై డ్రోన్ల దాడి, రూ.400 కోట్ల నష్టం!

తీగలాగితే డొంక కదిలింది.. ప్లైదుబాయ్ కో-పైలట్ గురించి షాకింగ్ విషయాలు, ఇకపై ఇజ్రాయెల్..

భారత్ కెప్టెన్ మచ్చర్‌కి ఇజ్రాయెల్ పీఎం బెంజిమన్ వీడియో కాల్.. డోర్ తీసే సమయంలో..

‘ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించా’.. ఎలాన్ మస్క్ సడెన్ బ్రేకప్‌పై.. శివోన్ జిలిస్ తీవ్ర భావోద్వేగం!

ఫ్లైదుబాయ్ దాడి ఘటన.. కో-పైలెట్ వెనుక ఉగ్రకోణం.. వెలుగులోకి సంచలన నిజాలు!

మాపై దాడికి తెగిస్తే అణ్వాయుధాలే.. నాటో దేశాలకు పుతిన్ ఘాటు వార్నింగ్!

ఫ్లై దుబాయ్ కాక్‌పిట్‌లో ఏం జరిగింది? గాల్లో ఉండగానే పైలట్‌పై కో-పైలట్ దాడి!

టిబెట్‌లో చైనా రహస్య తవ్వకాలు.. భారత్‌కు పొంచి ఉన్న అతిపెద్ద పర్యావరణ ముప్పు!

Big Stories

Advertisement
×