E-Paper
Advertisement

Viral Video: రైలెక్కిన ఆటో.. ఎలా వస్తాయి రా బాబూ ఇలాంటి ఐడియాలు!

Viral Video: రైలెక్కిన ఆటో.. ఎలా వస్తాయి రా బాబూ ఇలాంటి ఐడియాలు!
Advertisement

Auto On a Train: సాధారణంగా జనాలు రైలు ఎక్కి ప్రయాణించడం చూస్తుంటాం. కార్లు, బైక్‌లు, ట్రాక్టర్లు, లారీలు లాంటి వాహనాలను రైలు మీద ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడం కూడా తెలిసిన విషయమే. కానీ, రోడ్లపై ప్రయాణికులను ఎక్కించుకుని పరుగులు తీసే ఆటో రిక్షా రైలు ఎక్కడం మాత్రం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మహారాష్ట్రలో రైలులోకి ఒక ఆటోను ఎక్కిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఆటోను రైలెక్కించడం ఏంటి బాబోయ్!

వైరల్ వీడియోలో కొందరు వ్యక్తులు ఆటో-రిక్షాను రైలు కోచ్‌లోకి ఎక్కిస్తున్నట్లు కనిపిస్తోంది. సాధారణంగా ఆటోలను ఇలా రైల్లో ఎక్కించడం చాలా అరుదుగా కనిపించే విషయం. అందుకే ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో పాటు సరదాగా కూడా స్పందిస్తున్నారు. “రైలెక్కిన ఆటో?”, “ఎలా వస్తాయి రా బాబూ ఇలాంటి ఐడియాలు?”, “ఇక ట్రాఫిక్ జామ్ లేకుండా నేరుగా రైలులోనే ఆటో ప్రయాణమా?” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆటో డ్రైవర్ ఏదైనా కొత్త బిజినెస్ ఐడియాతో ఇలా చేస్తున్నాడేమో అంటూ జోకులు వేస్తున్నారు. మొత్తానికి ఆటోను రైలెక్కిస్తున్న ఘటన  సోషల్ మీడియాలో క్రేజీ చర్చకు దారితీసింది.

పార్సెల్ కోచ్‌లోకి ఎక్కించారా?

Advertisement

అయితే, ఈ వీడియో వెనుక అసలు విషయం ఏంటన్నదానిపై కూడా చర్చ జరుగుతోంది. రైలులోని ఎస్‌ఎల్‌ఆర్ లేదంటే పార్సెల్ కోచ్‌లో వాహనాలను తరలించే అవకాశం ఉంటుంది. సాధారణ పార్సెల్ బుకింగ్ ప్రక్రియలో భాగంగా కూడా ఈ ఆటోను రైలు ద్వారా మరో ప్రాంతానికి పంపిస్తూ ఉండవచ్చని కొందరు చెబుతున్నారు.  అయితే, ఆటో లాంటి వెహికల్ రైలెక్కుతున్న దృశ్యం అరుదుగా కనిపించడంతోనే ఈ వీడియోకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది.

నెటిజన్ల క్రేజీ రియాక్షన్స్

వీడియోలో ఆటోను కోచ్‌లోకి ఎక్కించే దృశ్యం చూడగానే చాలా మంది ఆశ్చర్యపోయారు. కొందరు “ఆటో డ్రైవర్‌కు ట్రాఫిక్ బాధ తప్పింది” అంటూ కామెంట్ చేస్తే, మరికొందరు “రైలు టికెట్ ఆటోకా.. డ్రైవర్‌ కా?” అంటూ సరదాగా ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఆటోకు కూడా ఇప్పుడు రైలు ప్రయాణం చేసే రోజులు వచ్చేశాయంటూ మీమ్స్ పంచుకుంటున్నారు.

మహారాష్ట్రను వదిలి వెళ్లిపోతున్నారా?

Advertisement

ఇదిలా ఉంటే, ఈ వీడియోపై మరో వాదన కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మహారాష్ట్రలో ఆర్టీఓ చర్యలు, అలాగే మరాఠీ భాష నేర్చుకోవాలనే ఒత్తిడి కారణంగా కొందరు ఆటో డ్రైవర్లు అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారనే చర్చ జరుగుతోంది. అయితే, వైరల్ వీడియోలోని ఆటోను ఎందుకు రైలు ద్వారా తరలిస్తున్నారనే విషయంపై స్పష్టత లేదు. అయినప్పటికీ, మహారాష్ట్రలో నెలకొన్న పరిస్థితుల కారణంగా కొందరు వలస డ్రైవర్లు తమ ఆటోలను తీసుకుని స్వస్థలాలకు తిరిగి వెళ్లిపోతున్నారనే వాదన మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read Also: ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర.. రోడ్ మధ్యలో డ్రైవర్ గాఢనిద్ర.. ఎంతకీ లేకవకపోవడంతో..

Tags

Related News

150 ఏళ్ల చరిత్ర ఉన్న నాంపల్లి స్టేషన్ గురించి మీకు తెలుసా?

కొమ్మల్లో సొమ్ము.. లక్కతో లక్.. చెట్లపై పెరిగే ఈ పురుగులతో బోలెడు ఆదాయం!

భారత్‌లో అత్యంత అందమైన రోడ్లు ఇవే.. ఒక్కసారి జర్నీ చేస్తే మళ్లీ వెళ్లాలనిపిస్తుంది!

వేల అడుగుల లోయలు.. వందల మలుపులు.. ఈ రోడ్లపై డ్రైవింగ్ చాలా డేంజరస్!

నిన్న లీగల్ నోటీసులు.. నేడు భూముల లెక్కలు.. స్వర్ణగిరి ఆలయానికి షాక్ మీద షాక్!

పిడుగు దెబ్బకు ఇండిగో విమానం డ్యామేజ్.. లక్నోలో సేఫ్‌గా ల్యాండింగ్, ఎలా జరిగింది?

ప్రపంచంలోనే బుల్లి నది.. పొడవు కేవలం 20 మీటర్లే.. కనుచూపు మేరలోనే కనుమరుగు!

‘హనుమాన్ అంశ్’ మూవీ ఎఫెక్ట్.. కైంచి ధామ్‌లో ఏకంగా 20 కి.మీ. ట్రాఫిక్ జామ్!

Big Stories

Advertisement
×