Big Stories

Earthquake in Taiwan: ప్రళయమంటే ఇదేనా..? తైవాన్‌లో కొత్త విషయాలు..!

Taiwan earthquake latest update

- Advertisement -

Earthquake in Taiwan: ప్రకృతి కన్నెర్ర చేస్తే.. దాన్ని అంచనా వేయడం కష్టం. ఏ రూపంలో ముంచుకొస్తుందో ఎవరికీ తెలీదు. అది మిగిల్చిన నష్టమూ వర్ణించలేము. మరికొందరైతే దగ్గరుండి మరీ చూస్తారు. తాజాగా తైవాన్‌లో భూకంపంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో ఇప్పుటివరకు 10 మంది మరణించగా, 1000 మందికి పైగా గాయపడ్డారు.

- Advertisement -

డ్యామేజ్ అయిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొన్నిప్రాంతాలకు సహాయక బృందాలు చేరుకోవడం కష్టంగా మారింది. ముఖ్యంగా రోడ్లు డ్యామేజ్ కావడంతో వాహనాలను మార్గ మధ్యలోనే వదిలి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అయితే భూకంపం సమయంలో చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ సన్నివేశాలను అక్కడే ఉన్న కొందరు చూసి ఆశ్చర్యపోయారు. ప్రకృతి బీభత్సం ఇంత దారుణంగా ఉంటుందా అని అక్కడే చర్చించుకున్నారు.

ప్రకృతి విపత్తులు వస్తే చాలు.. తమను తాము కాపాడుకోవడంలో నిమగ్నమవుతారు చాలామంది. ఆ ప్రాంతం నుంచి పారిపోతారు కూడా. కానీ తైవాన్‌ భూకంపంలో ఓ ప్రత్యేకత చోటు చేసుకుంది. భారీగా భూమి కంపించడంతో ఆసుపత్రిలోని నర్సులు భవనం వదిలి పారిపోకుండా.. తమ చుట్టూ ఉన్న చిన్నారులను కాపాడే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మాంచి స్పందన వస్తోంది.

నార్మల్‌గా తైవాన్ భూకంపం జోన్‌లో ఉండడంతో అక్కడి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉంటారు. అయితే బుధవారం ఉదయం వచ్చిన భారీ భూకంపం సమయంలో ఓ ఫ్యామిలీ కారులో వెళ్తోంది. ఘాటు రోడ్డు సమీపంలోకి వాహనం రాగానే లైటుగా భూమి కంపించడంతో స్లో అయ్యింది. ఈలోగా కొండచరియలు విరిగి పడడంతో వెనక్కి వెళ్లిపోవాలని ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో వెనుక నుంచి బలమైన బండరాయి వచ్చిన కారు ఢీకొట్టింది. అందులో చాలామందికి గాయాలయ్యాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News